ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'ఇప్పటికే బాధపడుతున్నాం.. ఇంకా బాధ పెట్టకండి'

ఉపాధి హామీ పథకంలో చేపట్టిన పనులను.. నాణ్యత పేరుతో ప్రభుత్వం పునఃపరిశీలన చేయించి బిల్లు చెల్లిస్తామని చెప్పడం సరికాదని పంచాయతీ పరిషత్ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ ముల్లంగి రామకృష్ణారెడ్డి అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 7వేల కుటుంబాలు ఈ బకాయిలు రాని కారణంగా ఇబ్బంది పడుతున్నట్టు చెప్పారు.

పంచాయతీ పరిషత్ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ ముల్లంగి రామకృష్ణారెడ్డి ప్రెస్​మీట్​
పంచాయతీ పరిషత్ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ ముల్లంగి రామకృష్ణారెడ్డి ప్రెస్​మీట్​

By

Published : Jun 9, 2020, 8:06 PM IST

ఉపాధి హామీ పథకంలో భాగంగా రెండేళ్ల కిందట ప్రతీ గ్రామంలో అభివృద్ధి పనులు చేపట్టిన సర్పంచ్‌లకు.. ప్రస్తుత ప్రభుత్వం మొండిచేయి చూపే ప్రయత్నం చేస్తోందని పంచాయతీ పరిషత్ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ ముల్లంగి రామకృష్ణారెడ్డి అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 7వేల కుటుంబాలు ఈ బకాయిలు రాని కారణంగా బాధితులుగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. వీరిలో అప్పుల బాధతో 18 మంది మరణించినట్లు తెలిపారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ పాలన సమయంలో సర్పంచ్‌లుగా గెలిచిన తాము అన్ని ప్రభుత్వాలతో సామరస్యంగా అభివృద్ధి పనులు చేపడుతూ ముందుకెళ్లామని చెప్పారు. అయినా ప్రభుత్వాలు తమ గోడు వినిపించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రెండేళ్ల కిందట సర్పంచ్‌లు చేపట్టిన ఉపాధి హామీ పనులకు ఇప్పటి ప్రభుత్వం మళ్లీ తనిఖీలు నిర్వహించి బిల్లు చెల్లిస్తామని చెప్పడం ఏంటని ప్రశ్నించారు. ఈ విషయమై ఇప్పటికే హైకోర్టులో న్యాయపోరాటం చేస్తున్న తాము భవిష్యత్తులో అవసరమైతే సుప్రీం కోర్టుకు వెళ్తామని స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details