ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

COMPENSATION: పథకాల పరిహారాల బాధ్యత గ్రామ, వార్డు సచివాలయాలకు అప్పగింత - మత్స్యకార భరోసా

రాష్ట్రంలో అమలు చేస్తున్న పలు పథకాలకు సంబంధించి పరిహారాల(COMPENSATIONS) బాధ్యతలను గ్రామ, వార్డు సచివాలయాలకు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ORDERS TO SACHIVALAYALU
పథకాల పరిహారాల బాధ్యత గ్రామ, వార్డు సచివాలయాలకు అప్పగింత

By

Published : Jul 1, 2021, 11:52 PM IST

పలు పథకాల పరిహారాల(COMPENSATIONS) బాధ్యతలను.. గ్రామ, వార్డు సచివాలయాలకు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా రైతు ఆత్మహత్యలు, వైఎస్సార్ బీమా, మత్స్యకార భరోసా, పశునష్ట పరిహారాలకు సంబంధించి బాధ్యతలను అప్పగించింది.

గ్రామ, వార్డు వాలంటీర్లు, సచివాలయాల విభాగం నుంచి దీని తొలి జీవో విడుదలైంది. సంబంధిత జేసీల పర్యవేక్షణలో అమలు ప్రక్రియ ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.

ABOUT THE AUTHOR

...view details