ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కృష్ణా జిల్లా వ్యాప్తంగా మారుమోగిన అమరావతి నినాదం - అమరావతి పోరాటం తాజా వార్తలు

కృష్ణా జిల్లా వ్యాప్తంగా అమరావతి నిరసన ర్యాలీలు, ధర్నాలు హోరెత్తాయి. రాజధాని రైతులకు మద్దతుగా తెదేపా, జనసేన, వామపక్షాలు, కాంగ్రెస్... నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని.. అది అమరావతే అని.. నేతలు నినదించారు.

కృష్ణా అంతటా మారుమోగిన అమరావతి నినాదం
కృష్ణా అంతటా మారుమోగిన అమరావతి నినాదం

By

Published : Oct 12, 2020, 5:20 PM IST

కృష్ణా జిల్లా వ్యాప్తంగా అమరావతి రైతులకు మద్దతుగా ప్రతిపక్షాలు ప్రదర్శనలు చేపట్టాయి.

నందిగామలో అమరావతి పరిరక్షణ సమితి ధర్నా

అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నందిగామ తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పాల్గొన్నారు.

విజయవాడ పటమలో..

పటమట తహసీల్దార్​ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, తెదేపా నేతలు నిరసన కార్యక్రమం చేపట్టారు. రైతుల త్యాగాలకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని నేతలు ప్రకటించారు.

గుడివాడలో...

నెహ్రూ చౌక్​లో తెదేపా నేతలు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ర్యాలీగా ఆర్డీవో కార్యాలయానికి వెళ్లారు. ఆర్డీవో శ్రీనుకుమార్​కు వినతిపత్రం అందించారు.

మైలవరంలో జనసేన...

జనసేన నేత రామ్మోహన్​ రావు ఆధ్వర్యంలో నేతలు నిరసన చేశారు. బోస్ బొమ్మ సెంటర్లో రాజధాని రైతులకు మద్దతుగా ప్రదర్శనలు చేశారు.

రాజధాని మహిళలపై అక్రమ కేసులు

అమరావతి రైతుల సహనం.. ఉన్నతమైందని తెదేపా నేత పంచుమర్తి అనురాధ కొనియాడారు. మహిళల పోరాటాన్ని ప్రభుత్వం గుర్తించాలని కోరారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలన్నారు.

బండిపాలెంలో రైతుల నిరాహార దీక్ష

అమరావతి మాత్రమే ఏకైక రాజధానిగా ఉండాలని జగ్గయ్యపేట మండలం బండిపాలెం గ్రామంలో రైతులు 12 గంటల నిరాహార దీక్ష చేపట్టారు. స్థానిక ఎన్టీఆర్ బొమ్మవద్ద ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో పెంట్యాల కోటేశ్వరావు, కాసరగడ్డ గురవయ్య, అడుసుమల్లి కృష్ణయ్య, అడుసుమల్లి స్వామి, అన్నబత్తుల పిచ్చియ్య, గడుపుడి సురేంద్ర, చిన్నం నవీన్ పాల్గొన్నారు.

మచిలీపట్నంలో అఖిలపక్షం నిరసన

అఖిలపక్షం ఆధ్వర్యంలో.. మచిలీపట్నంలోని కలెక్టరేట్‌ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు... జనసేన, కాంగ్రెస్‌, వామపక్షాల నాయకులు పాల్గొన్నారు. నిరసన అనంతరం ఆర్డీవోకు వినతిపత్రం అందజేశారు.

ఇదీ చదవండి:

అమరావతి గడ్డపైన గడ్డి కూడా తొలగించలేరు: లోకేశ్

ABOUT THE AUTHOR

...view details