ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

విజయవాడలో హైటెక్​ వ్యభిచారం గుట్టురట్టు - ఆన్​లైన్ సెక్స్ రాకెట్ న్యూస్

వాట్సప్‌లో అందమైన యువతుల ఫొటోలు పంపి యువకులను ఆకర్షిస్తారు... ఖరీదైన హోటళ్లకు విదేశీ యువతులను రప్పించి హైటెక్ తరహాలో వ్యభిచారం నిర్వహిస్తారు. విజయవాడలో గుట్టుచప్పుడు కాకుండా ఆన్‌లైన్ వ్యభిచారం దందా కొనసాగుతోంది. తాజాగా బీసెంట్ రోడ్డులోని ఓ హోటల్‌లో వ్యభిచార కేసులో ఓ యువతి, విటుడు పట్టుబడ్డారు.

Online sex rocket
Online sex rocket

By

Published : Dec 7, 2020, 4:54 PM IST

విజయవాడలో హైటెక్​ వ్యభిచారం గుట్టురట్టు

విజయవాడలో హైటెక్‌ వ్యభిచారం చాపకింద నీరులా విస్తరిస్తోంది. గుట్టుగా కొనసాగే అనైతిక కార్యకలపాలకు...పెరిగిన సాంకేతిక పరిజ్ఞానం వరంగా మారింది. హోటళ్లు, అతిథి గృహాల్లో సెక్స్‌ రాకెట్ల నిర్వహణకు కొన్ని మొబైల్‌ యాప్‌లు రాచమార్గాన్ని చూపిస్తున్నాయి. అంతర్రాష్ట్ర సెక్స్ రాకెట్ల నిర్వాహకులు సాంకేతికతను వినియోగించుకుని పోలీసులకు చిక్కకుండా జాగ్రత్త పడుతున్నారు. విటులను ఆకర్షించేందుకు రష్యా, నేపాల్, ఇండోనేషియా నుంచి యువతులను రప్పిస్తున్నారు. మరికొందరు టాలీవుడ్‌లోని జూనియర్‌ నటీమణులు, కోల్‌కతా, దిల్లీ, ముంబయి నగరాల్లో ఖరీదైన సెక్స్‌ వర్కర్లను రప్పిస్తున్నారు. పలు మొబైల్‌ యాప్‌లు, వెబ్‌సైట్ల ద్వారా అతిథి గృహాలు, హోటళ్లలో గదులను అద్దెకు తీసుకుంటున్న విటులు, సెక్స్‌వర్కర్లు.... తాము దంపతులమంటూ దర్జాగా హోటళ్లలో బస చేస్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి అమ్మాయిలను తీసుకొచ్చిన నిర్వాహకులు హోటల్‌ సిబ్బందితో కుమ్మక్కై ‌అనైతిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు.

అతిథుల ముసుగులో అసాంఘిక కార్యకలాపాలు

చరవాణి నుంచే యాప్‌ ద్వారా కొందరు కళాశాలల విద్యార్థులు, సెక్స్‌ రాకెట్ల నిర్వాహకులు హోటల్‌ గదులు, అతిథి గృహాలు బుక్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. తమ కళాశాలల్లో సదస్సులు నిర్వహిస్తున్నామని ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి అతిథులు వస్తున్నారని చెబుతున్నారు. గదులకు అడ్వాన్స్‌ చెల్లించిన తర్వాత వాటిని తమ అధీనంలోకి తీసుకుంటున్నారు. అతిథుల ముసుగులో యువతులు, సహవిద్యార్థినులను రప్పించుకుంటున్నారు. సెక్స్‌ రాకెట్ల నిర్వాహకులు విజయవాడ కమిషనరేట్‌ పరిధిలోని గవర్నర్‌పేట, సూర్యారావుపేట, సత్యనారాయణపురం పోలీసుస్టేషన్ల పరిధిలో ఖరీదైన హోటళ్లను బుక్‌ చేస్తున్నారు. యువతుల కోసం అతిథులు వస్తారంటూ ముందే హోటల్‌ సిబ్బందికి చెబుతున్నారు. అనంతరం విటులను పంపిస్తూ నిర్వాహకులు సొమ్ము చేసుకుంటున్నారు.

అమ్మాయిలతో రేవ్ పార్టీలు

తాజాగా విజయవాడ బీసెంట్‌ రోడ్డులోని ఓ హోటల్‌లో గుజరాత్‌ నుంచి తీసుకొచ్చిన మహిళతో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఆటోనగర్‌కు చెందిన నాని అనే యువకుడు ఇతర ప్రాంతాల నుంచి అమ్మాయిలను తీసుకొచ్చి ఈ వ్యవహారాన్ని నడిపిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. గతంలో భవానీపురంలోని ఓ హోటల్‌లో పశ్చిమబెంగాల్, గుజరాత్‌ల నుంచి అమ్మాయిలను తెప్పించి రేవ్ పార్టీలు నిర్వహించారు.

ఆన్‌లైన్ సెక్స్ రాకెట్​పై సీఐడీ పోలీసులు నిఘా పెట్టారు. రాష్ట్రంలో పలు నగరాల్లో హోటళ్లలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. అంతర్రాష్ట్ర ముఠాలు ఈ తరహా దందాలకు పాల్పడ్డాయా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి :ఆకతాయిల ఆగడాలు.. వెకిలిమాటలతో యువతులకు వేధింపులు

ABOUT THE AUTHOR

...view details