హైదరాబాద్ సీబీఐ కోర్టులో ఇవాళ ఓబుళాపురం గనుల కేసుల విచారణ జరిగింది. ఈ కేసులో అభియోగాల నమోదు, డిశ్చార్జ్ పిటిషన్ పై వాదనలు వినిపించేందుకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమయం కోరారు. కేసు నుంచి తనను తొలగించాలని కోరుతూ సబితా ఇంద్రారెడ్డి డిశ్చార్జ్ పిటిషన్ దాఖలు చేయగా... ప్రస్తుత దశలో కేసు నుంచి తొలగించవద్దని.. ఆమె ప్రమేయంపై ఆధారాలున్నాయని సీబీఐ కౌంటరు దాఖలు చేసింది. డిశ్చార్జ్ పిటిషన్‌తో పాటు కేసులో అభియోగాల నమోదుపై వాదనలు వినిపించేందుకు సబిత సమయం కోరడంతో విచారణను ఆగస్టు 2కి వాయిదా వేసింది. ఓఎంసీ కేసు నుంచి తొలగించాలని కోరుతూ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్‌పై కూడా విచారణను ఆగస్టు 2కి వాయిదా వేసింది.
సీబీఐ కౌంటర్ దాఖలు
ప్రస్తుత దశలో కేసు నుంచి పేరును తొలగించవద్దని.. ఆమె ప్రమేయంపై ఆధారాలున్నాయని సీబీఐ కౌంటరు దాఖలు చేసింది. దీంతో డిశ్చార్జ్ పిటిషన్‌తో పాటు కేసులో అభియోగాల నమోదుపై వాదనలు వినిపించేందుకు సబిత సమయం కోరడంతో విచారణను సీబీఐ కోర్టు ఆగస్టు 2కి వాయిదా వేసింది. అలాగే కేసు నుంచి తన పేరు తొలగించాలని కోరుతూ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్‌పైనా విచారణను కూడా ఆగస్టు 2కు వాయిదా వేసింది.
పేరు తొలగించాలని మంత్రి పిటిషన్