చనిపోతూ మరో ఇద్దరికి అవయవదానం - organs donation
బ్రెయిన్ డెడ్ అయిన వృద్ధురాలి అవయవాలను ఆమె కుటుంబ సభ్యులు దానం చేసి...మరో ఇద్దరి ప్రాణాలు నిలబెట్టిన ఘటన విజయవాడలో జరిగింది.
చనిపోతూ మరో ఇద్దరికీ అవయవదానం చేసిన వృద్ధురాలు
తాను చనిపోతూ మరో ఇద్దరికి ప్రాణదానం చేసింది ఓ వృద్ధురాలు. గుంటూరు జిల్లా తెనాలి కి చెందిన 63 ఏళ్ల వృద్ధురాలు కొన్ని రోజులుగా ఆరోగ్యం బాగలేక చికిత్స పొందుతుంది. మెరుగైన వైద్యం కోసం కుటుంబ సభ్యులు ఈ నెల 21న గుంటూరులోని రమేష్ హాస్పిటల్ లో చేర్పించారు. అన్ని వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు బ్రెయిన్ డెడ్ అయినట్లు తెలిపారు. జీవనాధార సంస్థ ద్వారా అవయవాలు దానం చేయడానికి మహిళ కుటుంబ సభ్యులు ముందుకు వచ్చారని వైద్యులు తెలిపారు.