హైదరాబాద్ నుంచి దుర్గమ్మ దర్శనం కోసం విజయవాడ వచ్చి లాక్ డౌన్ కారణంగా ఇక్కడే చిక్కుకుపోయిన 'పెద్దమ్మ' ఎట్టకేలకు స్వగ్రామానికి బయలుదేరింది. భాగ్యనగరానికి చెందిన సరస్వతీబాయి 3 నెలల క్రితం దుర్గమ్మ ఆలయానికి వచ్చింది. లాక్డౌన్ కారణంగా అక్కడే చిక్కుకుపోయింది. ఆమె పరిస్థితిపై ఈనాడు, ఈటీవీ భారత్ కథనం ప్రచురించాయి.
అధికారుల స్పందన
దీనిపై స్పందించిన రైల్వే అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిథులు వృద్ధురాలికి సహాయం అందించేందుకు ముందుకు వచ్చారు. రైల్వే లాకరులో ఉన్న లగేజీని విజయవాడ రైల్వేస్టేషన్ డైరెక్టర్ సురేశ్ వృద్ధురాలికి ఇప్పించారు. శిశు సంక్షేమ కమిటీ ఛైర్మన్ బీవీఎస్ భాస్కర్ శుక్రవారం ఉదయం హైదరాబాద్ వెళ్లేందుకు గోల్కొండ్ ఎక్స్ప్రెస్కు టికెట్ తీసిచ్చారు. సొంతూరుకు వెళ్తున్నాననే ఆనందం ఆ వృద్ధురాలిని చిన్నపిల్లను చేసింది. ఆనందభాష్పాలతో తనకు సహాయం అందించిన వారికి కృతజ్ఞతలు తెలిపి సంతోషంగా బయలుదేరింది.
ఇవీ చదవండి...
దుర్గమ్మ దర్శనానికి వచ్చి చిక్కుకుపోయిన పెద్దమ్మ