ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Officers Team Visit Polavaram Project: పోలవరం ప్రాజెక్టు పనులు పరిశీలించిన జలవనరుల శాఖ అధికారులు - పోలవరం నిర్మాణ పనులపై అధికారుల సమీక్ష

Officers team at polavaram project: పోలవరం ప్రాజెక్టు వద్ద జలవనరుల శాఖ అధికారులు పర్యటించారు. ప్రాజెక్టు పనుల పురోగతిని అధికారులు, మేఘా ఇంజినీరింగ్ సంస్థ ప్రాజెక్టు ఇంజినీర్లు వారికి వివరించారు.

Officers team visit polavaram project
పోలవరం ప్రాజెక్టు వద్ద జలవనరుల శాఖ అధికారుల పర్యటన

By

Published : Dec 16, 2021, 10:14 AM IST

Officers team visit polavaram project: పోలవరం ప్రాజెక్టును ఉన్నతాధికారుల బృందం పరిశీలించింది. జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.ఎస్. జవహర్ రెడ్డి, ఇంజనీర్ ఇన్ చీఫ్ నారాయణ రెడ్డిలు పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించారు. ప్రాజెక్టు పనుల పురోగతిని అధికారులు, మేఘా ఇంజినీరింగ్ సంస్థ ప్రాజెక్టు ఇంజినీర్లు వివరించారు.

Officers review on Polavaram project work: ప్రాజెక్టు వద్ద స్పిల్ వే, ఎగువ, దిగువ కాఫర్ డ్యాంలు, తదితర నిర్మాణాల పనులను గురించి అధికారులు ఆరా తీశారు. ఈ నెల 20న డ్యాం డిజైన్ రివ్యూ కమిటీ సమావేశం ఉన్నందున పర్యటించారు. ఈ సందర్భంగా వేర్వేరు నిర్మాణ అకృతులకు సంబంధించిన అంశాలపైనా అధికారులు చర్చించనున్నారు.

ABOUT THE AUTHOR

...view details