విజయవాడ ఆర్ అండ్ బి బిల్డింగ్‌లోని స్టేట్ కొవిడ్ సెంటర్ సమావేశ మందిరంలో తితిదే ఈవోగా నియమితులైన వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ సీఎస్ డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డికి ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమం ఏర్పాటు చేశారు. వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు, శాఖాధిపతులు, సిబ్బంది పాల్గొని ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖలో పని చేస్తామని తానెప్పుడూ ఊహించలేదని... కొవిడ్ మహమ్మారిని నియంత్రించడంలో భగవంతుడు తనకు పెద్ద పరీక్షే పెట్టాడన్నారు. నవరత్నాలు, సుజాతారావు కమిటీ సిఫార్సుల అమలులో సఫలీకృతమయ్యామని తెలిపారు. కొవిడ్ నియంత్రణలో శాఖాధికారులందరూ ఎంతగానో తనకు సహకరించారన్నారు.
విజయవాడలో జవహర్ రెడ్డికి ఆత్మీయ వీడ్కోలు - జవహర్ రెడ్డి తాజా వార్తలు
విజయవాడలోని ఆర్అండ్బి బిల్డింగ్‌లో తితిదే ఈవోగా నియమితులైన జవహర్ రెడ్డికి ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో వివిధ శాఖాధిపతులు, సిబ్బంది పాల్గొన్నారు.
జవహర్ రెడ్డికి ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమం ఏర్పాటు చేసిన అధికారులు