ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అపరిశుభ్ర నీరు... అనారోగ్యంబారిన విద్యార్థులు

పాఠశాలలో వందలమంది విద్యార్థులు ఉన్నా... కుళాయిలు మాత్రం సరిపోయినన్ని లేవు. వాటిల్లో నుంచి వచ్చే ఆ కాస్త నీరూ రక్షితమైంది కాదు. ఇందుకు తోడు అపరిశుభ్ర వాతావరణం.. విద్యార్థులను అనారోగ్యంపాలు చేస్తోంది.

కొళాయిలు

By

Published : Aug 1, 2019, 10:50 PM IST

అపరిశుభ్ర నీరు... పైగా నాలుగే కొళాయిలు

విజయవాడ వాంబే కాలనీలోని డాక్టర్ జంధ్యాల దక్షిణామూర్తి మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో అపరిశుభ్రత వాతావరణం నెలకొంది. వందలాది మంది పిల్లలకు ఒకే మంచి నీటి కుళాయి ఉన్నందున తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రక్షిత మంచినీరు అందక ఈ పాఠశాలలో నీరు తాగి పలువురు చిన్నారులు ఇటీవల అస్వస్థతకు గురయ్యారు. పాఠశాల ప్రాంగణంలోనే మున్సిపల్ శాఖ శానిటరీ ఇన్స్పెక్టర్ కార్యాలయమూ ఉంది. దీని వల్ల చెత్త ఎత్తే వాహనాలు, ఇతర పారిశుద్ధ్య పనిముట్లు అక్కడే భద్రపరుస్తున్న కారణంగా... ఈగలు, దోమలు చేరి విద్యార్థులకు తీవ్ర అసౌకర్యం కలిగిస్తోందని స్థానికులు అంటున్నారు. విద్యాశాఖ, మున్సిపల్ శాఖ అధికారులు వెంటనే స్పందించి పాఠశాలలోని సమస్యలను తొలగించాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details