ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

NTR TRUST: సేవా కార్యక్రమాలకు మద్దతిస్తున్నవారికి ధన్యవాదాలు: నారా భువనేశ్వరి - విజయవాడ వార్తలు

రాష్ట్రంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎన్టీఆర్ ట్రస్ట్ సేవలు కొనసాగిస్తోంది. ఈ సేవల గురించి మాట్లాడిన నారా భువనేశ్వరి.. సహకరిస్తున్న వారందరికీ ధన్యవాదాలు తెలిపారు.

NTR TRUST
NTR TRUST

By

Published : Nov 24, 2021, 11:00 PM IST

నారా భువనేశ్వరి ఆదేశాలతో ఆరో రోజు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్టు(NTR TRUST SERVICES TO FLOOD EFFECTED) ఆధ్వర్యంలో వరద బాధితులకు సేవా కార్యక్రమాలు కొనసాగించారు. వరదల కారణంగా చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో సర్వం కోల్పోయిన బాధితులకు.. ఆహారం, తాగునీరు, పాలు పంపిణీ చేశారు.

వైద్య శిబిరాలు నిర్వహించి రోగులకు ఉచితంగా మందులు, వైద్యసేవలు అందించారు. ఎన్టీఆర్ ట్రస్టు నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలకు మద్దతు తెలుపుతున్న వారికి మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి ధన్యవాదాలు తెలిపారు. అందరి సహకారం.. మరింత సేవ చేసేందుకు ఎంతో తోడ్పాటునిస్తుందని అన్నారు.

ABOUT THE AUTHOR

...view details