NITI Aayog Vice Chairman meets CM Jagan: తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌తో నీతిఆయోగ్ బృందం భేటీ అయింది. రాష్ట్ర విభజన వల్ల ఎదురైన ఇబ్బందులను, రాష్ట్రంలో అమలవుతున్న నవరత్నాలపై నీతిఆయోగ్ వైస్ ఛైర్మన్ రాజీవ్‌కుమార్ బృందానికి అధికారులు వివరించారు. పారిశ్రామిక రాయితీ, పన్ను మినహాయింపు ఇవ్వాలని, కోరాపుట్, బాలంగీర్, బుందేల్ ఖండ్ తరహాలో అదుకోవాలని అధికారులు కోరారు. విభజన చట్టం హామీలన్నీ నెరవేర్చాలని విన్నవించారు. ఈ సందర్భంగా విద్యుత్ రంగ సమస్యను అధికారులు నీతి ఆయోగ్ దృష్టికి తీసుకెళ్లారు.
రాష్ట్రానికి కేంద్రం, నీతిఆయోగ్ అండగా నిలవాలి: సీఎం జగన్
రాష్ట్రానికి కేంద్రం, నీతిఆయోగ్ అండగా నిలవాలని సీఎం జగన్ కోరారు. రాష్ట్రానికి పూర్తి సహాయ సహకారాలు అందించాలన్న ఆయన...రుణ భారంతో ఉన్న విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ సంస్థలకు అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. విద్యుత్ సంస్థలను గాడిలో పెట్టేందుకు తగిన సాయం చేయాలని కోరారు.