ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కొత్త ఓటు కార్డుల కోలాహలం - new cards

రాష్ట్రంలో ఓట్ల జాతర సందడి మొదలైంది. ఓటుకు దరఖాస్తుకు చేసుకున్న అర్హులైన వారందరికీ గుర్తింపు కార్డులు జారీ చేయడానికి ఎన్నికల సంఘం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. వాటిని పంపిణీ చేసేందుకు వచ్చిన బూత్ లెవల్ అధికారులతో విజయవాడ నగర పాలక సంస్థ కార్యాలయంలో కోలాహలం నెలకొంది.

కొత్త ఓటు కార్డులు

By

Published : Mar 13, 2019, 6:13 PM IST

ఓటు గుర్తింపు కార్డుల సందడి
సార్వత్రిక ఎన్నికలకు నెల రోజులు మాత్రమే గడువు ఉన్నందున ఆ ప్రక్రియను రాష్ట్ర ఎన్నికల సంఘం వేగవంతం చేసింది. ఓటర్ల జాబితాలో మార్పు చేర్పులు చేసుకున్న వారు, కొత్త ఓటు నమోదు చేసుకున్న వారి కార్డులను విజయవాడ నగర పాలక సంస్థ వేదికగా....బూత్ లెవల్ అధికారులకు ఎన్నికల సంఘం ప్రతినిధులు అందజేస్తున్నారు. దాదాపు 26 వేల మందికి పైగా అర్హులకు సంబంధించిన కొత్త ఓటరు కార్డులు నగర పాలక సంస్థకు చేరుకున్నాయి. ప్రత్యేక డెస్క్ లు ఏర్పాటు చేసి నగర వాసులకు తమ ఓటు ఉందో లేదో జాబితాలో తనిఖీ చేసి చెబుతున్నారు. జాబితాలో ఓటు లేని పక్షంలో వెంటనే ఫామ్-6 ద్వారా ఓటు నమోదు చేస్తున్నారు.ఓట్లు తొలగించేది లేదు
ఓటు తొలగింపుపై ప్రజలు ఆందోళన చెందవద్దని...ఈ ఏడాది జనవరి నాటికి ఓటరు జాబితాలో ఉన్న వారి ఓట్లు ఎట్టి పరిస్థితుల్లోనూ తొలగించే అవకాశం లేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. కొత్త ఓటు నమోదు, పోలింగ్ కేంద్రాలకు సంబంధించి 1950కి ఫోన్ చేసి సందేహాలు నివృత్తి చేసుకోవచ్చని సూచిస్తున్నారు.
కాలమానితో అవగాహన
18 సంవత్సరాలు నిండి కొత్తగా ఓటు నమోదు చేసుకున్న ఓటర్లకు కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన ప్రత్యేక కాలమాని(క్యాలెండర్)ని అందించేందుకు కూడా ఎలక్షన్ రిటర్నింగ్ అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఓటు హక్కును వినియోగం, ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా స్వేచ్ఛగా, నైతికంగా ఓటు వేసేలా ఈ కాలమాని ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. వీటిని గుర్తింపు కార్డుతో సహా ఓటరుకు అందించేందుకు సిద్ధమవుతున్నారు.

సత్వరమే సమాచారం
విజయవాడ తూర్పు, పశ్చిమ, మధ్య నియోజకవర్గాలకు సంబంధి కొత్తగా ఓటు నమోదు చేసుకోవాలనుకే వారి కోసం నగర పాలక సంస్థ కార్యాలయం ఆవరణలోనే ప్రత్యేక కేంద్రాల ద్వారా సేవలందిస్తున్నారు. ఓటు నమోదు చేసుకోవాలనుకు వారు ముందుగా ఫాం-6 దరఖాస్తులను నింపి వాటిని ఆయా కేంద్రాల్లో అందిస్తే....ఆన్ లైన్ లో అప్ లోడ్ చేసి ఓటరుకు వెంటనే సంబంధిత సమాచారాన్ని అందిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details