ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఎన్నికలు పూర్తై నెల రోజులు దాటినా బాధ్యతలకు నోచుకోని సర్పంచులు

ఎన్నికలు పూర్తై నెల రోజులు దాటినా కొత్త సర్పంచ్​లు, వార్డులు బాధ్యతలకు నోచుకోలేకపోతున్నారు. పంచాయతీరాజ్‌ శాఖ ప్రకటించే ప్రమాణస్వీకార తేదీ కోసం వారు ఎదురుచూస్తున్నారు.

ఎన్నికలు పూర్తై నెల రోజులు దాటినా బాధ్యతలకు నోచుకోని సర్పంచులు
ఎన్నికలు పూర్తై నెల రోజులు దాటినా బాధ్యతలకు నోచుకోని సర్పంచులు

By

Published : Mar 23, 2021, 4:59 AM IST

పంచాయతీ ఎన్నికలు పూర్తై నెలరోజులు దాటినా..కొత్త సర్పంచ్‌లు, వార్డు సభ్యులు నేటికీ ప్రమాణ స్వీకారానికి నోచుకోలేదు. పంచాయతీరాజ్‌ శాఖ ప్రకటించే ప్రమాణ స్వీకార తేదీ కోసం..వీరంతా ఎదురు చూస్తున్నారు. సాధారణంగా ఫలితాలు వెలువడిన రెండు వారాల్లో...గ్రామ పంచాయతీ మొదటి సమావేశ తేదీని పంచాయతీరాజ్‌ శాఖ ప్రకటిస్తుంది. అదే రోజు రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా ఎన్నికైన సర్పంచులు, వార్డు సభ్యులు...పదవీ బాధ్యతలు స్వీకరించడం రివాజు. ఆరోజు నుంచి వారి పదవీ కాలం కూడా లెక్కలోకి వస్తుంది. గత నెలలో నాలుగు దశల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించగా...వివిధ జిల్లాల్లో నామినేష్లు వేయని 13 సర్పంచి, 723 వార్డు సభ్యుల స్థానాలకు ఈనెల 15న పోలింగ్ నిర్వహించారు. ఈ ప్రక్రియ కూడా పూర్తైయ్యాక అందరికీ కలిసి ఒకేసారి మొదటి సమావేశ తేదీ ప్రకటించే అవకాశం ఉందని అధికారులు చెబుతూ వచ్చారు. ఈ ఎన్నికలు కూడా పూర్తైనా...ప్రమాణస్వీకార తేదీ ఇంకా ఖరారు కాలేదు.

ABOUT THE AUTHOR

...view details