ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

నిఘా విభాగాధిపతి రేసులో ముగ్గురు అధికారులు - state government

ఇంటెలిజెన్స్ ఏబీ వెంకటేశ్వరరావు స్థానాన్ని వీలైనంత త్వరగా భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ముగ్గురు అధికారులను జాబితాను ఈసీకి పంపింది.

నళిన్ ప్రభాత్, విశ్వజీత్, కృపానంద

By

Published : Mar 30, 2019, 7:44 AM IST

నిఘా విభాగాధిపతి నియామకంపై చర్యలు
కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు బదిలీ అయిన నిఘా విభాగాధిపతి ఏబీ వెంకటేశ్వరరావు స్థానంలో మరొకరిని నియమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ముగ్గురు సీనియర్ అధికారులతో కూడిన జాబితాను సిద్ధం చేసినప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునేఠా... కేంద్ర ఎన్నికల సంఘానికి పంపారు. ఈ జాబితాలో ఏడీజీ ఆపరేషన్స్ నళిన్ ప్రభాత్, పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు ఛైర్మన్‌ కుమార్ విశ్వజీత్, హోంగార్డు ఏడీజీ కృపానంద త్రిపాఠి ఉన్నారు. వీరిపై శాఖాపరమైన విచారణలు, కేసులు పెండింగ్‌లో లేవని, విజిలెన్స్‌కు సంబంధించిన ఎలాంటి సమస్యలు లేవనిప్రభుత్వం పేర్కొంది. ఈ ముగ్గురిలో ఒక్కరిని నిఘా విభాగాధిపతి పోస్టుకు ఎంపిక చేయాలని... కేంద్ర ఎన్నికల సంఘానికి సూచించింది. త్వరలోనే ఈ ముగ్గురిలో ఒకరు నిఘా విభాగాధిపతిగా నియమతులయ్యే అవకాశం ఉంది.

ABOUT THE AUTHOR

...view details