విశాఖ జిల్లా నర్సీపట్నం పోలీస్ స్టేషన్లో ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. నర్సీపట్నం సమీపంలోని పినారిపాలెంకు చెందిన సంతోష్ తో పాటు మరో ఇద్దరినీ పోలీస్ వాహనం పై దాడి చేసిన ఘటనలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్టేషన్కు తీసుకువచ్చి విచారించారు. పోలీసులు వేధింపులకు మనస్థాపం చెందిన సంతోష్ భవనంపై నుంచి కిందకు దూకాడు. అతని కాలుకు తీవ్రగాయమైంది. క్షతగాత్రుడిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. పోలీసుల వేధింపు వల్లే సంతోష్ ప్రాణాలు తీసుకోవాలనే ప్రయత్నం చేశాడని బంధువులు ఆరోపిస్తున్నారు.
పోలీస్ స్టేషన్ పైనుంచి దూకిన నిందితుడు - police station
నర్సీపట్నంలో పోలీస్ స్టేషన్ భవనంపై నుంచి ఓ నిందితుడు కిందకు దూకేశాడు. క్షతగాత్రుణ్ణి పోలీసులు ఆస్పత్రికి తరలించారు.
నిందితుడు ఆత్మహత్యాయత్నం
Last Updated : Sep 15, 2019, 1:12 PM IST