ఐపీఎల్లో క్రిస్ గేల్ సాధించిన సుడిగాలి సెంచరీ రికార్డును.. ఇండియన్ పెట్రోల్ లీగ్‌లో మూడు రాజధానుల కెప్టెన్ జగన్ బద్దలు కొట్టారని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్(nara lokesh) ఎద్దేవా చేశారు. దేశంలో లీటర్ పెట్రోల్ ధర రూ.వంద దాటిన రాష్ట్రాల్లో.. ఏపీని అగ్రస్థానంలో నిలబెట్టారని మండిపడ్డారు. అవినీతిలోనూ.. ధరలు పెంచడంలోనూ తానే ఎ1 అని జగన్ నిరూపించుకున్నారని విమర్శించారు. పన్నులు తగ్గించుకుంటే.. పెట్రోల్, డీజిల్‌ను తక్కువ ధరకే ఇవ్వొచ్చని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఫేక్ కబుర్లు చెప్పిన జగన్ .. అధికారంలోకి వచ్చాక మామూలు పన్నులను రెండింతలు చేయటంతో పాటు జే ట్యాక్స్ కలిపి మరీ పెట్రోల్ ధరను సెంచరీ కొట్టించారని దుయ్యబట్టారు. ఈ మేరకు జగన్ ఇంధనం ధరల గురించి మాట్లాడిన వీడియోను తన ట్విట్టర్ ఖాతాకు లోకేశ్ జత చేశారు.
nara lokesh: ఐపీఎల్లో గేల్ రికార్డును జగన్ బద్దలు కొట్టారు: లోకేశ్ - Nara Lokesh latest news
ఐపీఎల్లో గేల్ సెంచరీ రికార్డును ఇండియన్ పెట్రోల్ లీగ్‌లో సీఎం జగన్ బద్దలు కొట్టారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్(nara lokesh) ఎద్దేవా చేశారు. దేశంలో లీటర్ పెట్రోల్ ధర రూ.వంద దాటిన రాష్ట్రాల్లో... ఏపీని అగ్రస్థానంలో నిలబెట్టారని మండిపడ్డారు.
నారా లోకేశ్