ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

LOKESH:'అయ్యన్నపాత్రుడుపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలి' - nara lokesh latest updates

LOKESH: తెదేపా సీనియర్ నేత అయ్యన్నపాత్రుడుపై పెట్టిన తప్పుడు కేసులను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ధ్వజమెత్తారు. వైకాపా నేతలు మాట్లాడుతున్న బూతులు పోలీసులకు వినసొంపుగా ఉంటున్నాయని మండిపడ్డారు.

నారాలోకేశ్
నారాలోకేశ్

By

Published : Feb 23, 2022, 4:42 PM IST

LOKESH: అయ్యన్నపాత్రుడు వాస్తవాలు మాట్లాడితేనే కేసులు పెట్టి అరెస్ట్ చేయడానికి వస్తే... వైకాపా నేతలు చెప్పే అబద్ధాలు - మాట్లాడే బూతులకి డైరెక్ట్ గా ఉరి వెయ్యాలని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేశ్‌ ధ్వజమెత్తారు. ఉచ్ఛనీచాలు మరిచి వైకాపా నేతలు మాట్లాడుతున్న బూతులు పోలీసులకు వినసొంపుగా ఉంటున్నాయని మండిపడ్డారు. వైకాపా నేతల తీవ్ర వ్యాఖ్యలపై కేసులు పెడితే కనీసం పోలీసులు స్పందించడంలేదన్నారు. జిల్లాలు దాటి మరీ తెదేపా నేతల్ని అరెస్ట్ చేయడానికి రావడమే రాజారెడ్డి రాజ్యాంగం ప్రత్యేకత అని లోకేశ్‌ విమర్శించారు. తెదేపా సీనియర్ నేత అయ్యన్నపాత్రుడుపై పెట్టిన తప్పుడు కేసులు వెంటనే ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని లోకేశ్‌ డిమాండ్‌చేశారు.

ABOUT THE AUTHOR

...view details