మహారాజా ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక చనిపోవడమనేది.. ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలేనని నారా లోకేశ్ విమర్శించారు. బాధిత కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్షంగా ప్రతి రోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు వివరిస్తున్నా.. ప్రభుత్వం మొద్దునిద్ర వీడడం లేదని, ఆసుపత్రుల్లో బెడ్లు, ఆక్సిజన్, మందులు అందక ప్రజలు నరకయాతన పడుతున్నారని లోకేశ్ మండిపడ్డారు. ఇప్పటికైనా జగన్ రెడ్డి పారాసిట్మాల్, బ్లీచింగ్ కబుర్లు మాని ప్రజల ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని సూచించారు.
'ఆక్సిజన్ లేక ప్రజల ప్రాణాలు పోతుంటే.. జగన్ ఐపీఎల్ మ్యాచ్లు చూస్తున్నారు' - విజయనగరం మహారాజ ఆస్పత్రిపై నారా లోకేశ్ కామెంట్స్
ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆక్సిజన్ అందక ప్రజల ప్రాణాలు పోతుంటే తాడేపల్లి నివాసంలో జగన్ రెడ్డి ఐపీఎల్ మ్యాచ్లు మిస్ అవ్వకుండా చూస్తున్నారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. విజయనగరం మహారాజా ప్రభుత్వ ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక చనిపోవడం పట్ల ఆయన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
nara lokesh on cm jagan over vizianagaram maharaja hospital deaths
తాడేపల్లి ప్యాలస్ నుంచి బయటకి వస్తే వాస్తవాలు తెలుస్తాయన్నారు. తక్షణమే బెడ్లు, ఆక్సిజన్, మందులు కొరత లేకుండా ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని లోకేశ్ డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి:విజయనగరం ప్రభుత్వాసుపత్రిలో ఆక్సిజన్ కొరత.. ఇద్దరు మృతి