ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Lokesh: అధోగతిలో అగ్రస్థానం.. ప్రగతిలో చివరి స్థానం: లోకేశ్

ఎవరెలా పోతే తనకేంటి.. తన ఇంట్లో హాయిగా నిద్రపోతే చాలు అన్నట్టుగా జగన్ రెడ్డి వ్యవహారశైలి ఉందని నారా లోకేశ్ విమర్శించారు. మూడో దశ ముప్పు హెచ్చరికలతో అన్ని రాష్ట్రాలు అప్రమత్తమై, వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేసిందన్నారు. మన రాష్ట్రంలో మాత్రం 18 ఏళ్లు పైబడిన వారికి ఒక్క డోసు 40 శాతం, రెండు డోసులను 16 శాతం మందికి వేసి.. దేశంలోనే అట్టడుగు స్థానంలో ఉందని మండిపడ్డారు.

nara lokesh fires on ycp over vaccination in state
వైకాపాపై నారా లోకేశ్ మండిపాటు

By

Published : Sep 4, 2021, 7:33 PM IST

ముఖ్యమంత్రి జగన్ రెడ్డి(CM Jagan) పాలనతో రాష్ట్రం అధోగతిలో అగ్రస్థానంలోనూ, ప్రగతిలో చిట్టచివరి స్థానంలోనూ ఉందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్(nara lokesh) దుయ్యబట్టారు. ఎవరెలా పోతే తనకేంటి.. తన ఇంట్లో హాయిగా నిద్రపోతే చాలు అన్నట్టుగా జగన్ రెడ్డి వ్యవహారశైలి ఉందని ఆయన విమర్శించారు.

మూడో దశ ముప్పు(third wave) హెచ్చరికలతో అన్ని రాష్ట్రాలు అప్రమత్తమై, వ్యాక్సినేషన్(corona vaccination)​ వేగవంతం చేశాయని గుర్తు చేశారు. మన రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం 18 ఏళ్లు పైబడిన వారికి ఒక్క డోసు 40 శాతం, రెండు డోసులను 16 శాతం మందికి వేసి.. దేశంలోనే అట్టడుగు స్థానంలో ఉందని మండిపడ్డారు. సామాజికవర్గం పేరుతో వ్యాక్సిన్ కంపెనీపై ఏడ్చే బదులు వచ్చిన వ్యాక్సిన్ వృథా కాకుండా వేసి ఉంటే ఈ దుస్థితి వచ్చేది కాదని హితవు పలికారు. మూడో దశ పిల్లలపై తీవ్ర ప్రభావం చూపనుందనే హెచ్చరికలపై.. సీఎం జగన్ మేల్కొనాలని ట్విట్టర్ ద్వారా తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details