అన్నదాతలకు భరోసా ఇవ్వకపోగా రైతులను కించపరుస్తూ మంత్రులు మాట్లాడటం బాధ్యతారాహిత్యమని నారా లోకేశ్ మండిపడ్డారు. కృష్ణాజిల్లా అవనిగడ్డ మండలం మోదుముడి గ్రామానికి చెందిన కౌలు రైతు ఓలేటి ఆదిశేషు అప్పుల భారంతో ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బాధాకరమన్నారు. తాడేపల్లి ప్యాలస్‌లో ఫిడేలు వాయించుకుంటున్న జగన్ రెడ్డి బయటకు వచ్చి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
'తాడేపల్లి ప్యాలెస్‌లో జగన్ రెడ్డి ఫిడేలు వాయించుకుంటున్నారా?' - జగన్‌పై నారా లోకేశ్ కామెంట్స్
రోజుకో కౌలు రైతు ఆత్మహత్యకి పాల్పడుతున్నా ప్రభుత్వంలో చలనం లేదని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. మూడు రోజుల వ్యవధిలో ముగ్గురు కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు.
'తాడేపల్లి ప్యాలెస్‌లో జగన్ రెడ్డి ఫిడేలు వాయించుకుంటున్నారా?'
ఆత్మహత్యలకు పాల్పడిన రైతు కుటుంబాలకు ప్రభుత్వం సాయం అందించాలన్నారు. ఖరీఫ్ సీజన్లో నష్టపోయిన రైతులకు నష్టపరిహారం వెంటనే చెల్లించాలని లోకేశ్ అన్నారు.