ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రజలను మోసం చేసి పండుగ చేసుకోవటమా..!: లోకేశ్

జగన్ ఏడాది పాలన పై ట్విటర్ వేదికగా విమర్శలు సంధించారు తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేశ్. జగన్ పాలన చూస్తే హైకోర్టు మెుట్టికాయలు, రాజ్యాంగ అతిక్రమణలు, కోర్టు ధిక్కారాలే గుర్తొస్తాయని ఎద్దేవా చేశారు.

nara lokesh commnets  cm  jagan one year administration
తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేశ్

By

Published : May 30, 2020, 12:59 PM IST

నారా లోకేశ్ ట్వీట్​

జగన్ ఏడాది పాలనలో 65 హైకోర్టు మెుట్టికాయలు, రాజ్యాంగ అతిక్రమణలు, కోర్టు ధిక్కారాలే గుర్తొస్తాయని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శ నారా లోకేశ్ ఎద్దేవా చేశారు. ప్రజల బాగు విషయానికి వస్తే 60 మంది నిర్మాణరంగ కార్మికులు, 65 మంది రాజధాని రైతులు, 750 మంది అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకున్నారని మండిపడ్డారు. ఇంతమందిని నమ్మించి మోసం చేసి బాధపెడుతూ ఏడాది పాలన అంటూ పండగలు చేసుకోవడమనేది సరికాదని విమర్శించారు.

ప్రజల ప్రశ్నలకు జగన్ సమాధానం చెప్పాలి: దేవినేని

ఏడాది పాలనలో రూ.87 వేల కోట్లు అప్పు, రెవెన్యూ లోటు రూ.70 వేల కోట్లు ఉందని మాజీ మంత్రి దేవినేని ఉమా ధ్వజమెత్తారు. కట్టిన ఇళ్లు, వచ్చిన పరిశ్రమలు - సున్నా అని దుయ్యబట్టారు. ప్రజా రాజధాని అమరావతితో పాటు పోలవరం, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం ముందుకెళ్లలేదని మండిపడ్డారు. బడ్జెట్ సొమ్ములు ఏమయ్యాయని ప్రజలు అడుగుతున్న ప్రశ్నలకు జగన్ సమాధానం చెప్పాలని ఉమా డిమాండ్ చేశారు.

ఇవీ చదవండి:

వైకాపా విధ్వంసకర పాలనకు ఏడాది : తెదేపా

ABOUT THE AUTHOR

...view details