దిశ చట్టం తెచ్చామని ప్రభుత్వం ప్రకటించి రెండేళ్లవుతున్నా రాష్ట్రంలోని మహిళలకు భద్రత లేకుండా పోయిందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. 21 రోజులు కాదు కదా.. 21 నెలలైనా నేరస్థులకు శిక్ష పడట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. లేని దిశ చట్టం వల్లే నేరస్థులకు 21 రోజుల్లో బెయిల్ వస్తోందన్న లోకేశ్... నిర్భయ చట్టం ప్రకారం కేసులు పెడితే బెయిల్ వచ్చేది కాదన్నారు. సీఎం సొంత నియోజకవర్గంలో మహిళ హత్యకు గురైనా చర్యలు తీసుకోలేదని ఆక్షేపించారు. తాడేపల్లి, పులివెందుల సహా ఎక్కడా మహిళలకు భద్రత లేదని దుయ్యబట్టారు.
Lokesh: రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదు: లోకేశ్
17:19 September 09
దిశ చట్టం ప్రశ్నగానే మిగిలిపోయింది
చెల్లికి న్యాయం చేయలేని వ్యక్తి రాష్ట్రానికి ఏం చేస్తారని నారా లోకేశ్ ప్రశ్నించారు. పరిహారంతో బాధ్యత తీరిందన్నట్లు వైకాపా వ్యవహారిస్తోందని విమర్శించారు. వైకాపా అధికారంలోకి వచ్చాక 517మంది మహిళలపై దాడులు జరిగాయని వివరించారు. నరసరావుపేట పర్యటనకు పిలుపునిస్తే 3 వేల మందిని మోహరించారని, ప్రభుత్వానికి ఎందుకంత భయమని ప్రశ్నించారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా బాధితులకు అండగా ఉంటామని లోకేశ్ స్పష్టం చేశారు.
దిశ చట్టం తెచ్చామని ప్రభుత్వం ప్రకటించి రెండేళ్లవుతోంది. దిశ చట్టం ప్రశ్నగానే మిగిలిపోయింది. 21 రోజులు కాదు కదా 21 నెలలైనా నేరస్థులకు శిక్ష పడట్లేదు. సీఎం సొంత నియోజకవర్గంలో మహిళ హత్యకు గురైనా చర్యలు లేవు. చెల్లికి న్యాయం చేయలేని వ్యక్తి రాష్ట్రానికి ఏం చేస్తారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా బాధితులకు అండగా ఉంటాం. -నారా లోకేశ్, తెదేపా నేత
అనుబంధ కథనం