'చదువులే లేకపోతే మాకు యూనిఫాం ఇస్తే ఏంటి?.. బెల్ట్ ఇస్తే ఏంటి?. వాటిని ఇంట్లో పూజించుకుంటామా' అంటూ ఓ విద్యార్థి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న వీడియోను తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్వీట్(lokesh on aidied schools) చేశారు. బడి మూసేస్తావా? శకుని మావా అంటున్న పిల్లలకు, వారి తల్లిదండ్రులకు ఏం సమాధానం చెబుతావ్ జగన్‌రెడ్డి' అని (nara lokesh comments on cm jagan) నిలదీశారు. ఎయిడెడ్ స్కూళ్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో వల్లే తమ పాఠశాలలను మూసేస్తున్నారంటూ.. విశాఖపట్నంలో పలువురు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సోమవారం ఆందోళన చేపట్టారు. రోడ్డుపై రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా వాళ్లు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్న ఓ వీడియోను లోకేశ్ జత చేశారు.
Lokesh: జగన్‌రెడ్డి.. ఇప్పుడు వాళ్లకు ఏం సమాధానం చెబుతావ్ ? లోకేశ్ - lokesh news
బడి మూసేస్తావా..? శకుని మావా అంటున్న పిల్లలకు, వారి తల్లిదండ్రులకు ఏం సమాధానం చెబుతావ్ జగన్‌రెడ్డి' అని నారా లోకేశ్(nara lokesh comments on cm jagan) నిలదీశారు. ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో వల్లే తమ పాఠశాలలను మూసేస్తున్నారంటూ.. ఓ విద్యార్థి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న వీడియోను లోకేశ్ తన ట్వీట్ కు(lokesh on aidied schools) జత చేశారు
lokesh