కరోనా రోగులకిచ్చే భోజనాన్నీ వదలడం లేదు: లోకేశ్ - nara lokesh on food news
కొవిడ్ ఆసుపత్రుల్లో వసతులు అద్భుతం అంటూ అధికార పార్టీ నాయకుల మాటలు కోటలు దాటుతుంటే వాస్తవానికి రోగులకు భోజనం కూడా అందటం లేదని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ధ్వజమెత్తారు.
వాళ్లు కరోనా రోగులకిచ్చే భోజనాన్ని వదలడం లేదు:లోకేశ్
కర్నూలు విశ్వభారతి ఆస్పత్రిలో భోజనం పెట్టండి మహాప్రభో అంటూ రోగులు ఆందోళన చెయ్యాల్సిన పరిస్థితి వచ్చిందంటూ నారా లోకేశ్ ట్వీట్ చేశారు. సంబంధిత వీడియోను తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఆసుపత్రులు, క్వారంటైన్ సెంటర్లలో కరోనా రోగులు పడుతున్న బాధలు చూస్తుంటే బాధేస్తుందన్న లోకేశ్... టెస్టింగ్ కిట్లు, బ్లీచింగ్ కొనుగోలు పేరుతో కోట్లు మింగారని ఆరోపించారు. జగన్ రెడ్డి అనుచర గణం ఇప్పుడు రోగులకు ఇచ్చే భోజనాన్ని కూడా వదలడం లేదని మండిపడ్డారు.