శాంతియుతంగా చేపట్టే శ్రమదానానికి ఆటంకాలు సృష్టించడం అప్రజాస్వామికమని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. రహదారుల మరమ్మతులకు పిలుపునిస్తే పోలీసులు ఆటంకాలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. సెప్టెంబర్ 27నే డీజీపీకి శ్రమదానం కార్యక్రమం విషయం గురించి తెలిపామని చెప్పారు. రాజమహేంద్రవరం అర్బన్ ఎస్పీ, అనంతపురం ఎస్పీకి కూడా సమాచారమిచ్చినట్లు తెలిపారు. పార్టీ తలపెట్టిన శ్రమదానంలో కార్యక్రమంలో జనసైనికులను పాల్గొనకుండా పోలీసులు నిర్బంధిస్తున్నారని నాదెండ్ల మనోహర్ ఆరోపించారు.
NADENDLA : 'శాంతియుత శ్రమదానానికి అడ్డగింత ఎందుకు..?' - జనసేన వార్తలు
జనసేన రాష్ట్రంలో తలపెట్టిన శ్రమదానం కార్యక్రమాన్ని పోలీసులు కావాలని అడ్డగిస్తున్నారని నాందెెండ్ల మనోహర్ అన్నారు. తమ పార్టీ కార్యకర్తలను నిర్భందించడం సరికాదన్నారు.
NADENDLA MANOHAR