గుప్త నిధుల కోసమే తెలంగాణ సచివాలయం కూలుస్తున్నారని ఆ రాష్ట్ర కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి ఆరోపించారు. సచివాలయ కూల్చివేతకు కోర్టుల నుంచి అనుమతి రాగానే సీఎం ఫామ్ హౌజ్‌కి వెళ్లారని ప్రచారం జరుగుతోందన్నారు. సీఎం కేసీఆర్ ఫామ్ హౌజ్‌కి వెళ్ళారా? లేదంటే రహస్య ప్రదేశానికి వెళ్ళారా అనేది బ్రహ్మ రహస్యం! అని ఎద్దేవా చేశారు. సెక్రటేరియట్‌పై గతంలోనే ఎన్ఎండీసీ కేంద్ర సంస్థతో సర్వే జరిగిందన్నారు.
"సెక్రటేరియట్ పక్కనే ఉన్న మింట్ కాంపౌండ్‌లో ఆరో నిజాం కాలంలో నాణేల ముద్రణ జరిగింది అని ప్రచారం. జీ-బ్లాక్ నుంచి ఐదో నిజాం పరిపాలన సాగించారని ఇంగ్లీషు పత్రికలు కథనాలు రాశాయి. జీ-బ్లాక్ నుంచి బయటకు సొరంగ మార్గాలు ఉన్నాయి. అందుకే వాటి కింద గుప్త నిధులు ఉంటాయనే అనుమానాలున్నాయి.
-రేవంత్ రెడ్డి, తెలంగాణ ఎంపీ