ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

సీఎం జగన్​కు వైద్యం గురించి ఏం తెలుసు?: వైకాపా ఎంపీ రఘురామ - సీఎం జగన్​ వార్తలు

వైద్యం పట్ల అవగాహన లేని సీఎం చర్యల వల్లనే ప్రస్తుతం రాష్ట్రంలో కేసుల విజృంభణకు కారణమని ఆరోపించారు వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు. కరోనా కట్టడి చర్యలపై దృష్టి సారించకుండా.. వాటిపై ప్రశ్నించేవారిపై అక్రమ కేసులు పెట్టడాన్ని తప్పుపట్టారు.

నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు
బీకాం సీఎంకి ఏం తెలుసు ఎంపీ రఘురామవైద్యం గురించన్న

By

Published : May 8, 2021, 9:46 PM IST

కరోనాతో సహజీవనం చేయాల్సిందే, పారాసిటమాల్‌ మాత్ర వేసుకుని, ఇంటి పరిసరాల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లుకుంటేచాలన్న ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి వైద్యం గురించి ఏం తెలుసని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రశ్నించారు. బీకాం చదువుకున్న సీఎం అవగాహనారాహిత్యపు వ్యాఖ్యల వల్లే ఇప్పుడు రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగి దుర్భర పరిస్థితులు నెలకొన్నాయని ఆరోపించారు.

కరోనా కారణంగా రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, ప్రతిపక్ష నాయకులపై ప్రభుత్వం పెడుతున్న కొత్త కేసులు, ముఖ్యమంత్రి ట్వీట్లు, పలు ఇతర ముఖ్య అంశాలపై రఘురామకృష్ణరాజు విమర్శించారు. కరోనాపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారంటూ ఓ మాజీ విలేఖరి ద్వారా పోలీసు కేసు పెట్టించడంపై ధ్వజమెత్తారు. నాన్‌ బెయిలబుల్ కేసు రిజిస్ట్రర్ చేయడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

వైరస్​ కట్టడిలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని సాక్షాత్తూ సుభాష్‌చంద్రబోస్, సత్యనారాయణ, భరత్‌ రామ్ లాంటి వైకాపా నేతలు చర్చించుకున్న వీడియోలు విడుదలవడాన్ని రఘురామ గుర్తు చేశారు. అలాగే, రోజా కూడా ఉన్నది ఉన్నట్లే లాప్‌ట్యాప్‌లో మాట్లాడారని తెలిపారు. మహారాష్ట్రలో కరోనా కట్టడి కోసం ప్రభుత్వం.. ముంబయిలో ఒక వార్‌రూం, ప్రత్యేక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు చర్చించి తీసుకుంటున్న చర్యలు మంచి సత్ఫలితాలిస్తున్న విషయాన్ని ఎంపీ ప్రస్తావించారు.

ABOUT THE AUTHOR

...view details