ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

RRR: 'సీఎం పర్యటనకు వెళ్లినప్పుడల్లా.. బొత్స అలాగే మాట్లాడతారు' - మంత్రి బొత్సపై రఘురామ కామెంట్స్

ముఖ్యమంత్రి పర్యటనలకు వెళ్లినప్పుడల్లా రాజధానిపై మంత్రి బొత్స..అగ్గి రాజేస్తున్నారని ఎంపీ రఘురామ కృష్ణరాజు అన్నారు. రాజధానిని తరలించాలని చూస్తే.. భూములిచ్చిన వేల మంది రైతులు చూస్తూ ఊరుకోబోరన్నారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి దారుణంగా తయారైందని రఘురామ ఆక్షేపించారు.

సీఎం పర్యటనలకు వెళ్లినప్పుడల్లా బొత్స అలాగే మట్లాడతారు
సీఎం పర్యటనలకు వెళ్లినప్పుడల్లా బొత్స అలాగే మట్లాడతారు

By

Published : Aug 30, 2021, 3:34 PM IST

Updated : Aug 30, 2021, 5:51 PM IST

ముఖ్యమంత్రి పర్యటనలకు వెళ్లినప్పుడల్లా రాజధానిపై మంత్రి బొత్స..అగ్గి రాజేస్తున్నారని ఎంపీ రఘురామకృష్ణరాజు ఆక్షేపించారు. మూడు రాజధానుల ఆలోచనపై మండిపడ్డ ఆయన..అదో మతిలేని ప్రకటన అని ఎద్దేవా చేశారు. రాజధానిని తరలించాలని చూస్తే భూములిచ్చిన వేల మంది రైతులు చూస్తూ ఊరుకోబోరన్నారు. రాజధాని తరలించాలంటే సుమారు రూ. 90 వేల కోట్ల పెనాల్టీ కట్టాల్సి ఉంటుందని అన్నారు. కర్నూలులో హైకోర్టు పెట్టే పరిస్థితులు ఉన్నాయా ? అని ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రభుత్వ విభాగాలన్నీ ఒకేచోట ఉండాలని ప్రజలు కోరుకుంటారని తెలిపారు. కర్నూలులో హైకోర్టు పెడితే అధికారులే వెళ్లలేని పరిస్థితి ఏర్పడుతుందన్నారు. మంత్రి బొత్స మాటలు పట్టించుకోవద్దని అమరావతి రైతులు, మహిళలకు సూచించారు.

ఎంపీ రఘురామ కృష్ణరాజు

కరోనా కేసుల కంటే ప్రభుత్వంపైనే ఎక్కువ కేసులు నమోదు. కర్నూలులో హైకోర్టు పెట్టే పరిస్థితులు ఉన్నాయా ?. కర్నూలులో హైకోర్టు పెడితే అధికారులే వెళ్లలేని పరిస్థితి. అన్ని ప్రభుత్వ విభాగాలు ఒకేచోట ఉండాలని ప్రజలు భావిస్తారు. న్యాయస్థానాలపై వైకాపా ప్రభుత్వానికి ఉన్న అభిప్రాయాన్ని తలుచుకుంటేనే బాధేస్తోంది. ముఖ్యమంత్రి పర్యటనలకు వెళ్లినప్పుడల్లా రాజధానిపై మంత్రి బొత్స..అగ్గి రాజేస్తున్నారు. గతంలోనూ బొత్స ఇలాగే చేశారు. బుద్ధి ఉన్న వారెవరూ ముడు రాజధానులనే కాన్సెప్ట్ గురించి మాట్లాడరు. మూడు రాజధానులు మతిలేని ప్రకటన. ఈ ప్రభుత్వంలో ఉన్న ఏ ఒక్కరికి రాజధాని అంటే అర్థం తెలియదు. రాష్ట్రంలో లోకాయుక్త, హ్యమన్ రైట్స్ ఎక్కడున్నాయని అందరూ అడుగుతున్నారు. రాజధానిని తరలించాలని చూస్తే భూములిచ్చిన వేల మంది రైతులు చూస్తూ ఊరుకోరు. మంత్రి బొత్స మాటలు అమరావతి రైతులు, మహిళలు పట్టించుకోవద్దు. - రఘురామ కృష్ణరాజు, నరసాపురం ఎంపీ

రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి గేదెల కోసం స్విమ్మింగ్ పూల్స్ కట్టినట్లు ఉందని రఘురామ ఎద్దేవా చేశారు. 25 కేంద్ర ప్రభుత్వ పథకాలకు కేంద్రం రూ. 12 వేల కోట్లు ఇస్తే.. రాష్ట్రం మరో రూ. 6 నుంచి 7 వేల కోట్లు మార్జిన్ మనీ కలిపి ఇవ్వాలన్నారు. ఆ డబ్బుల కోసం ఎస్‌బీఐ నుంచి అప్పుగా తీసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని.. అలా చేయడం ఎఫ్‌ఆర్‌బీఎం నిబంధనలు ఉల్లంఘించటేమనని అన్నారు. రాష్ట్రంలో ఒక ఆర్థిక మంత్రి, దిల్లీలో మరో ఆర్థిక మంత్రి ఉండవలసిన పరిస్ధితులు ఏర్పడ్డాయన్నారు. జగన్ భిక్షతో దొడ్డిదారిన విజయసాయి రెడ్డి ఎంపీ అయ్యారని.. తాను ప్రజల చేత ఎన్నికయ్యానని వ్యాఖ్యానించారు.

Last Updated : Aug 30, 2021, 5:51 PM IST

ABOUT THE AUTHOR

...view details