తన స్థానికత్వంపై ఆరోపణలు చేస్తున్నారని గల్లా జయదేవ్ ఆవేదన చెందారు. చిత్తూరు నుంచి వచ్చానని పలుమార్లు తెలిపినట్లు వెల్లడించారు. గుంటూరు ప్రజలకు తానెంటో ప్రత్యేకంగా నిరూపించుకోవాల్సిన అవసరం లేదని ... అభివృద్ధే ప్రజలందరికీ తనని చేరువ చేసిందని ఆయన తెలిపారు. మరోసారి గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు.తెదేపా నుంచి ఎమ్మెల్యే గెలిచిన మోదుగుల... వైకాపాకు కోవర్టుగా వ్యవహరించారని గల్లా ఆరోపించారు. చివరి నిమిషం వరకు పార్టీలో ఉండి... పనులన్నీ పూర్తి చేయించుకున్న తర్వాతేపార్టీని వీడారని విమర్శించారు.
ముగ్గురు తోడు దొంగలు ఏకమయ్యారు!
గుంటూరు తూర్పు, పశ్చిమ, ప్రత్తిపాడు ఎమ్మెల్యేలు తోడు దొంగల్లా వ్యవహరించి జిల్లా అభివృద్ధిని అడ్డుకున్నారని ఎంపీ గల్లా జయదేవ్ విమర్శించారు. గుంటూరు ప్రజలకు తానేంటో ప్రత్యేకంగా నిరూపించుకోవాల్సిన అవసరం లేదని... అభివృద్ధే ప్రజలందరికీ తనని చేరువ చేసిందని ఆయన తెలిపారు.
ఎమ్మెల్యే మోదుగులపై గల్లా జయదేవ్ విమర్శలు
ఇదీ కూడా చదవండి..