కృష్ణా నదికి వహద ప్రవాహం పెరిగే అవకాశం ఉందని గుంటూరు జిల్లా పాలనాధికారి శామ్యూల్ ఆనంద్, కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ స్పష్టం చేశారు. 9 నుంచి 9.50 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు ప్రవహించే అవకాశం ఉందన్నారు. తీరప్రాంత, లంక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని... లోతట్టు ప్రాంత ప్రజలు ప్రజలు సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని రెండు జిల్లాల కలెక్టర్లు సూచించారు. వరద ఉద్ధృతిపై అధికారులను అప్రమత్తం చేసిన కలెక్టర్లు...సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
కృష్ణానదికి పెరుగుతున్న వరద...అధికారుల అప్రమత్తం - కృష్ణా నదిలో వరద ప్రవాహం వార్తలు
కృష్ణా నదికి వరద ప్రవాహం ఎక్కువయ్యే అవకాశమున్నట్లు గుంటూరు, కృష్ణా కలెక్టర్లు తెలిపారు. లోతట్టు ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని సూచించారు.
కృష్ణా నదికి వరద ప్రవాహం పెరిగే అవకాశం: గుంటూరు కలెక్టర్