రాష్ట్ర శాసనమండలిలో ఎమ్మెల్యేల కోటాలో భర్తీ చేయనున్న మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో రెండు స్థానాలకు వైకాపా అభ్యర్థులు ఖరారయ్యారు. మంత్రి మోపిదేవి వెంకటరమణ, మాజీ పోలీసు అధికారి ఇక్బాల్‌ల పేర్లను ముఖ్యమంత్రి జగన్ ఖరారు చేశారు. శాసనసభలో వైకాపాకి ఉన్న సంఖ్యాబలం రీత్యా మూడు ఎమ్మెల్సీ స్థానాలూ ఆ పార్టీకే దక్కనున్నాయి. ఈ మూడు స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై పార్టీ ముఖ్య నేతలు విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డితో జగన్ సమాలోచనలు చేశారు. మరో స్థానానికి చల్లా రామకృష్ణారెడ్డితో పాటు, మరికొందరు నాయకుల పేర్లు పరిశీలించినట్టు తెలిసింది. మూడో ఎమ్మెల్సీ స్థానం రామకృష్ణారెడ్డికి దక్కేందుకే అవకాశం ఉందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
వైకాపా ఎమ్మెల్సీ అభ్యర్థులుగా మోపిదేవి, ఇక్బాల్
ఎమ్మెల్యేల కోటాలో భర్తీ చేయనున్న మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో రెండు స్థానాలకు వైకాపా అభ్యర్థులను ఖరారు చేసింది. మంత్రి మోపిదేవి వెంకటరమణ, మాజీ పోలీసు అధికారి ఇక్బాల్‌ల పేర్లను ముఖ్యమంత్రి జగన్ ఖరారు చేశారు.
ఎమ్మెల్సీ అభ్యర్థులుగా మోపిదేవి, ఇక్బాల్
ఇవీ చూడండి-చిత్తు కాగితాల్లో దొరికిన వెండి కిరీటం