ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Ashok Babu: విలేజ్ కోఆర్డినేటర్ల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేయొద్దు: ఎమ్మెల్సీ ఆశోక్​బాబు - ఎమ్మెల్సీ ఆశోక్ బాబు తాజా వార్తలు

విలేజ్ కోఆర్డినేటర్ల (వీసీఓలు) భవిష్యత్తును ప్రశ్నార్థకం చేయవద్దని ఎమ్మెల్సీ అశోక్ బాబు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. 2ఏళ్లైనా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవటంతో వేతన బకాయిలు కోసం 21వేల మంది వీసీఓలు ఎదురు చూస్తున్నారని తెలిపారు.

ఎమ్మెల్సీ అశోక్ బాబు
ఎమ్మెల్సీ అశోక్ బాబు

By

Published : Jul 10, 2021, 10:56 PM IST

వయోజన విద్య, సాక్షర భారత్ వంటి పథకాలను నిబద్ధతతో అమలు చేసిన.. విలేజ్ కోఆర్డినేటర్ల (వీసీఓలు) భవిష్యత్తును ప్రశ్నార్థకం చేయవద్దని ఎమ్మెల్సీ అశోక్ బాబు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. వేతన బకాయిలు క్లియర్ చేసి వారికి అండగా ఉంటూ న్యాయం చేస్తామని పాదయాత్రలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని సూచించారు. అధికారంలోకి వచ్చి 2ఏళ్లైనా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవటంతో వేతన బకాయిలు కోసం 21వేల మంది వీసీఓలు ఎదురు చూస్తున్నారని తెలిపారు.

పెండింగ్ వేతనాలు చెల్లించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని స్పష్టం చేసారు. 2018 మార్చిలో కేంద్ర ప్రభుత్వం పథకాన్ని రద్దు చేసినప్పటికీ తెదేపా ప్రభుత్వం రాష్ట్ర నిధులతో కొనసాగించేందుకు సిద్ధమై ఇందుకు అనుగుణంగా 2019లో కొనసాగింపు ఉత్తర్వులిచ్చిందని పేర్కొన్నారు. ఎన్నికల కోడ్ కారణంగా పథకం అమలు వాయిదా పడిందని గుర్తు చేశారు.

ఇదీ చదవండి:

రూ.2,500 కోట్లు విలువ చేసే హెరాయిన్ సీజ్​

ABOUT THE AUTHOR

...view details