Ashok Babu on PRC GOs : ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన పీఆర్సీ జీవోలు ఉద్యోగులను ఆర్థికంగా కుంగదీసే విధంగా ఉన్నాయని తెదేపా ఎమ్మెల్సీ అశోక్‌బాబు అన్నారు. ఇంత దారుణమైన పీఆర్సీని ఎప్పుడూ చూడలేదని.. ఇకపై చూడబోయేది లేదని మీడియా సమావేశంలో ఎద్దేవా చేశారు. రెండేళ్లు పదవీ విరమణ వయసు పెంచారని ఎంతో సంతోషపడ్డారని పేర్కొన్నారు. 23 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చినప్పుడే ఉద్యోగులు వ్యతిరేకించాల్సిందని.. ఉద్యోగులకు జరుగుతున్న అన్యాయంపై అప్పుడే ప్రశ్నించాల్సిందని వెల్లడించారు. ఉద్యోగ సంఘాల తీరుతో ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారని.. 14 లక్షల ఉద్యోగుల జీతభత్యాలపై ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. ఉద్యోగ సంఘాల జేఏసీలో ఉన్నత స్థానాల్లో ఉన్నవారి మాటలు కిందిస్థాయి ఉద్యోగుల భవిష్యత్‌ను నిర్దేశిస్తాయనే ఆలోచన నేతలకు లేకుండా పోయిందని విమర్శించారు.
Ashok Babu on PRC GOs: పీఆర్సీ జీవోలు ఉద్యోగులను ఆర్థికంగా కుంగదీసే విధంగా ఉన్నాయి: ఎమ్మెల్సీ అశోక్‌బాబు - prc
Ashok Babu on PRC GOs: ఉద్యోగ సంఘాల తీరుతో ఉద్యోగులు నష్టపోతున్నారని తెదేపా ఎమ్మెల్సీ అశోక్‌బాబు అన్నారు. పీఆర్సీ ప్రకటించగానే వ్యతిరేకించి ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదని అభిప్రాయపడ్డారు.
చరిత్రలో దుర్మార్గంగా మిగిలిపోయే పీఆర్సీని ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారని.. ఉద్యోగులు ఈ ప్రభుత్వానికి ఓటేశారన్న విశ్వాసాన్ని కూడా సీఎం పట్టించుకోలేదన్నారు. ఉద్యోగులు భౌతిక పోరాటం చేయకుండా సోషల్ మీడియా గ్రూపుల ద్వారా పోరాడితే ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు. ప్రభుత్వం జీవోలు జారీ చేసిన తర్వాత ఉద్యోగ సంఘాల నేతలు ఎంత గింజుకున్నా ఉపయోగం ఉండదని పేర్కొన్నారు. తాను తెదేపా నేతగా కాకుండా, మాజీ ప్రభుత్వ ఉద్యోగిగానే మాట్లాడుతున్నట్లు స్పష్టం చేశారు. ఉద్యోగ సంఘాల నేతల వైఖరితో దాదాపు 14 లక్షల మంది ఉద్యోగులు తీవ్రంగా నష్టపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి..:ఈ పీఆర్సీ మాకొద్దు.. సమ్మెకు వెనుకాడబోం: ఉద్యోగ సంఘాలు