ప్రతి ఒక్క అధికారి కరోనా పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని... ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి అన్నారు. కొవిడ్ పై అధికారులతో చీరాల నియోజకవర్గస్థాయి సమావేశం నిర్వహించారు. చీరాల మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశానికి నియోజకవర్గ కొవిడ్ ప్రత్యేక అధికారి గ్రంధి మాధవి, కమిషనర్ రామచంద్రారెడ్డి తదితరులు హాజరయ్యారు.
కొవిడ్ పట్ల అవగాహన కల్పించండి: ఎమ్మెల్యే బలరాం - praksham news
రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో... కరోనా పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని చీరాల ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి అధికారులకు సూచించారు.
ఎమ్మెల్యే బలరాం
లాక్ డౌన్ కారణంగా.... నియోజకవర్గంలో చేపడుతున్న చర్యలు, క్వారంటైన్ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన భోజన వసతి గురించి ఎమ్మెల్యే అధికారులతో చర్చించారు. అధికారులకు ఎమ్మెల్యే కరణం బలరాం పలుసూచనలు ఇచ్చారు.
ఇవీ చదవండి:'గాలి ద్వారా కరోనా వైరస్ వ్యాప్తి'