విజయవాడలో జరుగుతున్న రహదారుల మరమ్మతు పనులను మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పరిశీలించారు. నగరవ్యాప్తంగా పలుచోట్ల రోడ్లపై గుంతలు పడి ప్రయాణికులు ఇబ్బుంది పడుతున్నారు. వాటికి నగరపాలక సంస్థ అధికారులు మరమ్మతు చేస్తున్నారు. వన్‌టౌన్ నెహ్రూ బొమ్మ సెంటర్ నుంచి చిట్టినగర్ వరకు జరుగుతున్న పనులపై మంత్రి ఆరా తీశారు. పనుల నాణ్యతను అడిగి తెలుసుకున్నారు. సాధారణ పద్ధతిలో వేసిన రోడ్లు త్వరగా దెబ్బతింటున్నాయని, అందుకే ఈసారి పాలిమర్ కలిగిన కూల్ కాంక్రీట్ మిక్స్‌తో మరమ్మతులు చేస్తున్నామని మంత్రి తెలిపారు.
రహదారుల మరమ్మతు పనుల పరిశీలన - repairs
విజయవాడలో నగరపాలక సంస్థ కొత్త టెక్నాలజీతో రోడ్లకు మరమ్మతు చేస్తోంది. వర్షం పడినా దెబ్బతినని విధంగా పాలిమర్ కూల్ కాంక్రీట్ మిక్స్‌తో రహదారికి మరమ్మతులు చేస్తున్నారు. ఈ పనులను మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పరిశీలించారు.
విజయవాడలో రహదారుల మరమ్మతు.. మంత్రి పరిశీలన