పతాకస్థాయికి ప్రతిపక్షనేతల్లో ఓటమి భయం:మంత్రి సోమిరెడ్డి - somi reddy
ఈసీ విధులను రాష్ట్ర ప్రభుత్వం ఏవిధంగా నిర్వర్తించగలదో జగన్మోహన్‌రెడ్డి సమాధానం చెప్పాలని మంత్రి సోమిరెడ్డి ప్రశ్నించారు.
ప్రతిపక్ష నేతల్లో ఓటమి భయం పతాకస్థాయికి చేరిందని మంత్రి సోమిరెడ్డి అన్నారు. ఈసీ విధులను రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా నిర్వర్తించగలదో జగన్మోహన్‌రెడ్డి సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. రాష్ట్రంలో 59 లక్షల18 వేల నకిలీ ఓట్లు ఉన్నాయని ఈసీని జగన్మోహన్ రెడ్డి ఆశ్రయించడం ఓటమి భయానికి అద్దం పడుతోందని ఎద్దేవా చేశారు. ఈసీ స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థని... దానిపై కనీస పరిజ్ఞానం జగన్‌కు లేదన్నారు. నకిలీ ఓట్లుంటే ఈసీకి, కలెక్టర్లకు ఫిర్యాదు చేయాలని తెలియదా అంటూ మంత్రి ఆక్షేపించారు.