ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

విద్యుత్ బ్యాటరీతో నడిచే ద్విచక్రవాహనాలను ప్రారంభించిన మంత్రి - విజయవాడలో విద్యుత్ బ్యాటరీతో నడిచే వాహనాలను ఆవిష్కరించిన మంత్రి

విద్యుత్ బ్యాటరీతో నడిచే బౌన్స్ ద్విచక్రవాహనాలను విజయవాడలో మంత్రి పేర్నినాని ప్రారంభించారు. ఓ హోటల్​లో నిర్వహించిన కార్యక్రమానికి హజరైన మంత్రి ఈ విద్యుత్ వాహనాలను ఆవిష్కరించారు.

విద్యుత్ బ్యాటరీతో నడిచే ద్విచక్రవాహనాలను ప్రారంభించిన మంత్రి
విద్యుత్ బ్యాటరీతో నడిచే ద్విచక్రవాహనాలను ప్రారంభించిన మంత్రి

By

Published : Aug 10, 2021, 3:43 PM IST

విద్యుత్ బ్యాటరీతో నడిచే ద్విచక్రవాహనాలను ప్రారంభించిన మంత్రి

విద్యుత్ బ్యాటరీతో నడిచే బౌన్స్ ద్విచక్ర వాహనాలను మంత్రి పేర్నినాని ప్రారభించారు. విజయవాడ నగరంలో ఓ హోటల్ లో బౌన్స్ ప్రతినిధులు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పేర్నినాని ఈ విద్యుత్ వాహనాలను ఆవిష్కరించారు. ఎమ్మెల్యే మల్లాది విష్ణుని ద్విచక్రవాహనంపై ఎక్కించుకొన్న మంత్రి.. నగరంలో కాసేపు సంచరించారు.

పర్యావరణ హితంగా ఉండేందుకే ఈ విద్యుత్ వాహనాలను తెచ్చామన్న బౌన్స్ సంస్థ ప్రతినిధులు.. మెుదటగా బెంగళూరు, విజయవాడలోనే ప్రారంభించామని చెప్పారు. చాలా తక్కువ రుసుములు వసూలు చేస్తూ ఈ వాహనాలను వినియోగదారులకు అందిస్తున్నామని తెలిపారు. పర్యావరణాన్ని కాపాడేందుకు విద్యుత్ ఆధారిత వాహనాలను తెచ్చామని పేర్కొన్నారు. ప్రస్తుతం విజయవాడలో 600 బౌన్స్ విద్యుత్ వాహనాలు తిరుగుతున్నాయని సంస్థ ప్రతినిధులు తెలిపారు. నగరంలో తమ విద్యుత్ వాహనాలకు డిమాండ్ పెరిగిందని సంతోషం వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details