Minister Review on New Power Units: విద్యుత్ కొరతను తీర్చే అంశంలో కొత్త విద్యుత్ ప్రాజెక్టులను వేగవంతం చేయాల్సి ఉందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. సచివాలయంలో విద్యుత్ శాఖ అధికారులతో మంత్రి ఈ అంశంపై సమీక్ష నిర్వహించారు. ఏపీలో కొత్త విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణ పురోగతిపై మంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు. మరో మూడు నెలల్లో ఎన్టీపిఎస్ స్టేజ్ -5 పూర్తి చేయాలని మంత్రి ఆదేశాలిచ్చారు. కృష్ణపట్నం స్టేజ్ 2 ప్లాంట్ నిర్మాణం వేగవంతం చేయాలని సూచించారు. రెండు ప్లాంట్లు వినియోగంలోకి వస్తే ప్రస్తుత సామర్ధ్యానికి అదనంగా 1600 మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి వస్తుందని మంత్రి అన్నారు. కొత్త హైడల్ ప్రాజెక్ట్ ల నిర్మాణానికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచనలు ఇచ్చారు. దేశ వ్యాప్తంగా విద్యుత్ కొరత తీవ్రంగా ఉందని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలోనే విద్యుత్ కోతలు తక్కువని మంత్రి వివరించారు.
ఇతర రాష్ట్రాలతో పోలిస్తే... మన దగ్గరే విద్యుత్ కోతలు తక్కువ - మంత్రి పెద్దిరెడ్డి - కొత్త విద్యుత్ ప్రాజెక్టులు
Minister Review on New Power Units: విద్యుత్ కొరతను తీర్చే అంశంలో కొత్త విద్యుత్ ప్రాజెక్టులను వేగవంతం చేయాల్సి ఉందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు.
Minister Peddireddy Ramachanda reddy