ధర్నా కేసులో అభియోగాలను ఎదుర్కొంటూ న్యాయస్థానానికి హాజరుకాని మంత్రి కొడాలి నాని(ఏ4), ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి(ఏ1)లకు నాన్ బెయిలబుల్ వారెంటు జారీ చేస్తూ విజయవాడలోని ప్రత్యేక కోర్టు జడ్జి ఏడుకొండలు మంగళవారం ఆదేశాలు ఇచ్చారు. 2015 జూన్ 25న విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద అనధికారికంగా నాని, పార్థసారథి, మరో 18 మంది ధర్నా చేయడం వల్ల సూర్యారావుపేట పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో మంగళవారం వ్యక్తిగతంగా హాజరుకావాలని జడ్జి ఆదేశించారు. గైర్హాజరవడం వల్ల వారితో పాటు మరో పది మందికి జడ్జి నాన్ బెయిలబుల్ వారెంటు జారీ చేశారు.
కొడాలి నాని, పార్థసారథిలకు నాన్‌బెయిలబుల్ వారెంట్ - kodali nani latest updates
2015 సంవత్సరంలో విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి అనధికారిక ధర్నా చేశారు. వీరిని పోలీసులు అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. మంగళవారం వ్యక్తిగత హాజరుకు జడ్జి ఆదేశాలు జారీ చేశారు. గైర్హాజరు కావడం వల్ల వారితో పాటు మరో పది మందికి వారెంటు జారీ చేశారు.

నాన్‌బెయిలబుల్ వారెంట్