ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Kannababu Fire on Pawan: కులాలను రెచ్చగొట్టేలా పవన్​ వ్యాఖ్యలు: కన్నబాబు

వైకాపాపై ఏమని యుద్ధం ప్రకటించారో పవన్ చెప్పాలని మంత్రి కన్నబాబు డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యంపై నమ్మకం లేనివారే యుద్ధం గురించి మాట్లాడతారని దుయ్యబట్టారు. కులాలను రెచ్చగొట్టేలా పవన్‌ మాట్లాడారని..,కులం కార్డుతో ఏ ప్రభుత్వం విజయం సాధించలేదనే విషయాన్ని గుర్తుంచుకోవాలని హితవు పలికారు.

వైకాపాపై ఏమని యుద్ధం ప్రకటించారో పవన్ చెప్పాలి
వైకాపాపై ఏమని యుద్ధం ప్రకటించారో పవన్ చెప్పాలి

By

Published : Oct 2, 2021, 5:56 PM IST

Updated : Oct 2, 2021, 6:15 PM IST

కులాలను రెచ్చగొట్టేలా పవన్​ వ్యాఖ్యలు

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం బహిరంగ సభలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి కన్నబాబు మండిపడ్డారు. వైకాపాపై ఏమని యుద్ధం ప్రకటించారో పవన్ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యంపై నమ్మకం లేనివారే యుద్ధం గురించి మాట్లాడతారని దుయ్యబట్టారు. కులాలను రెచ్చగొట్టేలా పవన్‌ మాట్లాడారని ఆక్షేపించారు. కులం కార్డుతో ఏ ప్రభుత్వం కూడా విజయం సాధించలేదనే విషయాన్ని గుర్తుంచుకోవాలని హితవు పలికారు. పవన్ ఒకటిన్నర నిమిషం శ్రమదానం చూసి అంతా నవ్వుతున్నారని కన్నబాబు ఎద్దేవా చేశారు.

వైకాపాపై ఏమని యుద్ధం ప్రకటించారో పవన్ చెప్పాలి. పవన్ ఒకటిన్నర నిమిషం శ్రమదానం చూసి అంతా నవ్వుతున్నారు. రోడ్ల మరమ్మతులకు సీఎం రూ.2,200 కోట్లు కేటాయించారు. వర్షాలు తగ్గాక రోడ్ల మరమ్మతులు చేయాలని సీఎం ఆదేశించారు. హైదరాబాద్‌లో ఉండే పవన్‌కు ఇక్కడి పరిస్థితులు ఎలా తెలుస్తాయి?. కులాలను రెచ్చగొట్టేలా పవన్‌ మాట్లాడారు. ప్రభుత్వం కాపులను అణగదొక్కిందన్న మాటలు హాస్యాస్పదం. 12 ఏళ్లలో ఎమ్మెల్యే కాలేకపోయానన్న బాధ పవన్‌లో కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో కులాల కుంపటి రాజేస్తామని పవన్ చెప్పారు. కులం కార్డుతో ఏ ప్రభుత్వం కూడా విజయం సాధించలేదు. జగన్‌కు ఒక కులాన్ని ఆపాదించి లబ్ధి పొందేందుకు యత్నం. జగన్ సీఎం అయితే రాజకీయాల నుంచి తప్పుకుంటానన్న మాట మరిచారా ? కోడికత్తి కేసును ఎన్‌ఐఏ, వివేకా హత్య కేసును సీబీఐ దర్యాప్తు చేస్తున్నాయి. ఈ కేసులు త్వరగా తేల్చాలని కేంద్రాన్ని కోరాలి. ప్రజాస్వామ్యంపై నమ్మకం లేనివారే యుద్ధం గురించి మాట్లాడతారు. -కన్నబాబు, మంత్రి

రాజకీయాలంటే సినిమా యాక్షన్ కాదని పవన్‌ గుర్తించాలని మంత్రి కన్నబాబు హితవు పలికారు. సమాజాన్ని కులాలు, మతాలు, ప్రాంతాలుగానే పవన్‌ చూస్తున్నారా? అని నిలదీశారు. ప్రజా సమస్యల పట్ల పవన్ చిత్తశుద్ధి ఏమిటో తెలుస్తోందని ఆక్షేపించారు. రాష్ట్రంలో దశలవారీగా మద్య నియంత్రణ చేస్తామని హమీ ఇచ్చామని..,ఆ ప్రక్రియ కొనసాగుతోందని కన్నబాబు వెల్లడించారు.

సంబంధిత కథనాలు

Last Updated : Oct 2, 2021, 6:15 PM IST

ABOUT THE AUTHOR

...view details