కాపు రిజర్వేషన్ల గురించి ప్రతిపక్ష పార్టీలు మాట్లాడుతుంటే విచిత్రంగా అనిపిస్తోందని మంత్రి కన్నబాబు అన్నారు. కాపు, ఒంటరి, బలిజ మహిళలకు ఆర్థిక సాయం అందించామని... 2.3 లక్షల మంది మహిళలకు రూ.350 కోట్లు ఇచ్చామని మంత్రి తెలిపారు. కాపు రిజర్వేషన్లపై జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు.
అన్ని పథకాల ద్వారా రూ.4,700 కోట్లు ఆయా వర్గాలకు ఇచ్చామని మంత్రి కన్నబాబు తెలిపారు. ఇంత చేస్తే పవన్ వ్యతిరేక వ్యాఖ్యలు చేయటం దారుణమన్నారు. కుల ప్రస్తావన లేకుండా పవన్ మాట్లాడలేరా అని మంత్రి ప్రశ్నించారు. గత ప్రభుత్వానికి స్నేహితుడిగా ఉన్న పవన్... ముద్రగడను అణచివేస్తుంటే ఒక్క మాట కూడా ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు.