ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పుర ఎన్నికల విజయంతో సీఎం జగన్​పై బాధ్యత మరింత పెరిగింది: మంత్రి అనిల్ - పురపాలక ఎన్నికల ఫలితాలపై మంత్రి అనిల్ కామెంట్స్

పుర ఎన్నికల విజయంతో సీఎం జగన్​పై బాధ్యత మరింత పెరిగిందని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్పష్టం చేశారు. మరింత సమర్థవంతగా ప్రజలకు సంక్షేమ పథకాలు అందించేందుకు వైకాపా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ప్రజల్లో వైకాపా ప్రభుత్వంపై ఉన్న నమ్మకానికి పురపాలక ఎన్నికల ఫలితాలే నిదర్శనమన్నారు.

పుర ఎన్నికల విజయంతో సీఎం జగన్​పై బాధ్యత మరింత పెరిగింది
పుర ఎన్నికల విజయంతో సీఎం జగన్​పై బాధ్యత మరింత పెరిగింది

By

Published : Mar 15, 2021, 7:50 PM IST

ప్రజల్లో వైకాపా ప్రభుత్వంపై ఉన్న నమ్మకానికి పురపాలక ఎన్నికల ఫలితాలే నిదర్శనమని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్పష్టం చేశారు. పుర ఎన్నికల ఫలితాలతో అన్ని ప్రాంతాల వారు మూడు రాజధానులకు మద్దతు పలికారన్న విషయం తేటతెల్లమైందన్నారు. రాష్ట్రంలో 84 శాతం వార్డులు, వందశాతం కార్పోరేషన్లను వైకాపా గెలుచుకుందని.. ఒక మున్సిపాలిటీ మినహా అన్నింటా విజయం సాధించామన్నారు. ప్రజలను రెచ్చగొట్టేలా చంద్రబాబు, లోకేశ్ మాట్లాడారని.. దీనికి తగినరీతిలో ఓటర్లు గుణపాఠం చెప్పారన్నారు.

వైకాపా పాలనలో అభివృద్ధి శూన్యమనేది అవాస్తమన్నారు. గ్రామాల్లో సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, ఆస్పత్రులు, పాఠశాలలను నిర్మిస్తున్నామని తెలిపారు. పుర ఎన్నికల విజయంతో సీఎం జగన్​పై బాధ్యత మరింత పెరిగిందన్నారు.

ABOUT THE AUTHOR

...view details