ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'తప్పు చేసిన వారిని ప్రభుత్వం శిక్షిస్తోంది.. అందులో తప్పేముంది' - తప్పు చేసిన వారిని ప్రభుత్వం శిక్షిస్తోంది..అందులో తప్పేముంది

తప్పులు చేసిన వారిని ప్రభుత్వం శిక్షిస్తోందని, దీంట్లో తప్పేముందని మంత్రి అనిల్​కుమార్ యాదవ్ వ్యాఖ్యానించారు. వైకాపా నేత మోకా భాస్కర రావు హత్య కేసులో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర పాత్ర ఉందని అన్నారు. అయ్యన్న పాత్రుడు మహిళ పట్ల అసభ్యకరంగా మాట్లాడారని.., అచ్చెన్నాయుడు 150 కోట్లు ఈఎస్ఐ కుంభకోణానికి పాల్పడ్డారని మంత్రి అనిల్​ ఆక్షేపించారు.

'తప్పు చేసిన వారిని ప్రభుత్వం శిక్షిస్తోంది..అందులో తప్పేముంది'
'తప్పు చేసిన వారిని ప్రభుత్వం శిక్షిస్తోంది..అందులో తప్పేముంది'

By

Published : Jul 6, 2020, 7:13 PM IST

వైకాపా నేత మోకా భాస్కరరావు హత్య కేసులో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర పాత్ర ఉందని.., కాబట్టే పోలీసులు ఆయనను అరెస్టు చేశారని మంత్రి అనిల్​కుమార్ యాదవ్ అన్నారు. హత్యకు ముందు.. తర్వాత హత్య చేసిన నిందితులతో కొల్లు రవీంద్ర మాట్లాడారని.., ఆయన ప్రోద్బలంతోనే హత్య జరిగినట్లు పోలీసులు నిర్ధారించారన్నారు. దీనికి సంబంధించి పోలీసుల వద్ద కచ్చితమైన ఆధారాలు ఉన్నాయన్నారు. కొల్లు రవీంద్ర అరెస్టును బీసీలపై వేధింపులుగా ప్రతిపక్షనేత చంద్రబాబు ఆరోపించడంపై మంత్రి అనిల్ మండిపడ్డారు.

మాజీమంత్రి అయ్యన్న పాత్రుడు మహిళ పట్ల అసభ్యకరంగా మాట్లాడారని.., అచ్చెన్నాయుడు 150 కోట్లు ఈఎస్ఐ కుంభకోణానికి పాల్పడ్డారని ఆక్షేపించారు. తప్పులు చేసిన వారిని ప్రభుత్వం శిక్షిస్తుందని.., దీంట్లో తప్పేముందన్నారు. తప్పు చేసిన వారిని చంద్రబాబు నాయుడు వెనకేసుకుని రావటం సరికాదన్నారు. అధికారంలో ఉన్నప్పుడు తనపై కూడా చంద్రబాబు తప్పుడు కేసులు పెట్టారని.. అవి నిరూపణ కాకపోవడంతో తాను బయటపడడ్డాన్నారు. తప్పు చేసిన వారిని ప్రభుత్వం శిక్షిస్తే కులాలు, మతాలను అంటగట్టడం సరికాదని హితవు పలికారు.

ఇదీ చదవండి: 'పేద‌లంద‌రికీ ఇళ్ల పేరుతో అక్రమాలు చేస్తున్నారు'

ABOUT THE AUTHOR

...view details