ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రేపే... స్వయం సహాయక మహిళల ఖాతాల్లోకి 6, 792 కోట్లు: బొత్స - పొదుపు సంఘాలు రుణాల చెల్లింపు వార్తలు

పొదుపు సంఘాల రుణాలు చెల్లిస్తామని సీఎం హామీ ఇచ్చినట్లు మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. స్వయం సహాయక బృందాల రుణాలను 4 ఏళ్లలో తిరిగి చెల్లిస్తామని చెప్పినట్లు వెల్లడించారు.

miniser botsa on women Thrift societies
miniser botsa on women Thrift societies

By

Published : Sep 10, 2020, 7:11 PM IST

పొదుపు సంఘాలకు ఉన్న రుణాల చెల్లింపు కార్యక్రమం రేపు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుందని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. 2019 ఏప్రిల్ 11 నాటికి స్వయం సహాయక బృందాల మహిళలకు ఉన్న 27, 128 కోట్ల రూపాయల రుణాలను 4 ఏళ్లలో తిరిగి చెల్లిస్తామని సీఎం హామీ ఇచ్చారన్నారు. ఆ మాట ప్రకారం తొలి ఏడాదికి గాను 6 వేల 792 కోట్ల రూపాయలు రుణాలను చెల్లిస్తున్నట్లు తెలిపారు.

రేపు ఉదయం 11 గంటలకు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి కంప్యూటర్ బటన్ నొక్కి సీఎం లబ్దిదారుల ఖాతాల్లో జమ చేస్తారని బొత్స చెప్పారు. 90 లక్షల స్వయం సహాయక మహిళలకు ఈ కార్యక్రమంతో లబ్ధి చేకూరుతుందన్నారు. ప్రతి ఇంటికీ కార్యక్రమాన్ని చేర్చేలా వారోత్సవం నిర్వహిస్తున్నామన్న మంత్రి... అందరూ పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు.

అంతర్వేది ఘటనపై సీబీఐ విచారణ ఎందుకు?

అంతర్వేదిలో రథం దగ్దం ఘటనపై వెంటనే ప్రభుత్వం చిత్తశుద్దితో చర్యలు తీసుకుందని ... ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటుందని బొత్స తెలిపారు. కొన్ని అల్లరి మూకలు విధ్వంసం సృష్టించేందుకు ప్రయత్నించాయని మంత్రి ఆరోపించారు. మంత్రి వెల్లంపల్లిపై దాడికి యత్నించారని.. చర్చిపై రాళ్లు విసిరారని అన్నారు. భగవంతున్ని నమ్మేవారెవరైనా ఇలాంటి కార్యక్రమాలు చేస్తారా అని ప్రశ్నించారు. అంతర్వేది ఘటనపై సీబీఐ విచారణ ఎందుకని బొత్స ప్రశ్నించారు.

ఇదీ చదవండి:

మూడు రాజధానులు తప్పు లేదు.. హైకోర్టులో కేంద్రం అఫిడవిట్

ABOUT THE AUTHOR

...view details