స్వస్థలాలకు వెళ్లేందుకు అనుమతివ్వాలని వలస కూలీలు విజయవాడ సబ్‌కలెక్టర్ కార్యాలయానికి పోటెత్తారు. అధికారులు వారి నుంచి వివరాలు సేకరించి పంపిస్తున్నారు. ఇప్పటివరకు దాదాపు 4 వేల మంది స్వస్థలాలకు వెళ్లేందుకు దరఖాస్తు చేసుకున్నారు. అయితే రెడ్‌జోన్ కావడం వల్ల వారికి ఏ విధంగా పాస్‌లు ఇవ్వాలనేదానిపై అధికార వర్గాల్లో స్పష్టత కొరవడింది.
ప్రభుత్వ పెద్దలే దీనిపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని సబ్‌కలెక్టర్ కార్యాలయ సిబ్బంది తెలిపారు. అయితే తమ సమస్యను పరిష్కరించడం లేదని వలసకార్మికులు ఆవేదన చెందుతున్నారు. ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. ప్రభుత్వం స్పందించి తమను త్వరగా తమ ప్రాంతాలకు చేర్చాలని కోరుతున్నారు.