వైద్య విద్య సీట్ల భర్తీ ప్రక్రియ రాష్ట్ర వ్యాప్తంగా ఆరు కేంద్రాల్లో కొనసాగుతుంది. ఈ యేడాది యాజమాన్య సీట్ల భర్తీ సైతం వెబ్ ఆప్షన్స్ ద్వారా చేసేందుకు వర్శిటీ అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. మొత్తం 15 వేల మంది విద్యార్థులు వైద్య విద్యలో ప్రవేశాల కోసం ఆన్లైన్ దరఖాస్తు చేసుకున్నారు. ఈ నెల 3 నుంచి 8వ తేదీ వరకు విద్యార్థుల ధృవపత్రాల పరిశీలన ఉంటుంది. పరిశీలన అనంతరం విద్యార్థులు వెబ్ ఆప్షన్స్ ద్వారా కాలేజీల్లో ప్రవేశం పొందుతారు. అయితే ఈడబ్లూఎస్ కోటాకు సంబంధించి ప్రభుత్వ ఉత్తర్వులు రానందున.. కోటాను రెండో విడత కౌన్సెలింగ్‌లో అమలు చేస్తామని వర్శిటీ అధికారులు చెపుతున్నారు. రెండో కౌన్సెలింగ్‌లో ఈడబ్ల్యూఎస్ కోటా అమలు చేసినా విద్యార్థులకు ఎటువంటి నష్టం జరగదని ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య సి వి రావు వివరించారు.
యాజమాన్య సీట్లు వెబ్ ఆప్షన్ల్తో భర్తీ
వైద్య విద్య సీట్ల భర్తీల్లో ఎలాంటి అపోహలు విద్యార్థులు, తల్లిదండ్రులు పెట్టుకోవద్దని... అర్హత గల వారికి తప్పకుండా సీట్లు వస్తాయని ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య సి.వి. రావు తెలిపారు. ఈ ఏడాది యాజమాన్య సీట్ల భర్తీని వెబ్ ఆప్షన్స్‌తో సీట్లు నింపేందుకు వర్శిటీ అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు
యాజమాన్య సీట్లు వెబ్ ఆప్షన్ల్తో భర్తీ