రైతులకు ఏవైనా సమస్యలుంటే 1902 నెంబరుకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయొచ్చని మార్కెటింగ్ శాఖ ప్రత్యేక కమిషనర్ ప్రద్యుమ్న తెలిపారు. ఇతర రాష్ట్రాలకు సరకు తీసుకెళ్లేవారు 9182361331, 0866-2469901 నెంబర్లకు ఫోన్ చేయెుచ్చన్నారు.
నిరంతరం నిత్యావసరాల సరఫరా జరిగేలా పర్యవేక్షణ
లాక్‌డౌన్ కారణంగా... రైతులు, వినియోగదారులు ఇబ్బంది పడకుండా పటిష్ఠ చర్యలు చేపడుతున్నామని మార్కెటింగ్ శాఖ ప్రత్యేక కమిషనర్ ప్రద్యుమ్న తెలిపారు. నిత్యావసరాల ధరలు నిర్ణయించేందుకు జిల్లా స్థాయి కమిటీలు ఏర్పాటు చేశామన్నారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లోనూ ప్రజలకు నిరంతరాయంగా నిత్యావసరాలను సరఫరా చేస్తున్నామన్నారు. కనీస ధర చెల్లించి రైతుల నుంచి పంట కొనుగోలు చేయడంతో పాటు.... మార్కెటింగ్ కల్పనకు కృషి చేస్తున్నామంటున్న ప్రద్యుమ్నతో ముఖాముఖి..
నిరంతరం నిత్యావసరాల సరఫరా జరిగేలా పర్యవేక్షణ