ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఖైరతాబాద్‌ సదర్‌ ఉత్సవాల్లో అపశ్రుతి... దున్నపోతు దాడిలో పలువురికి గాయాలు

వాహనాల సైరన్​​ శబ్ధాలకు హైదరాబాద్ ఖైరతాబాద్ కూడలిలో దున్నపోతు బెదిరింది. ఒక్క సారిగా వాహనదారులపైకి దూసుకొచ్చింది. ఈ క్రమంలో పలువురు గాయపడ్డారు.

By

Published : Nov 5, 2021, 8:41 PM IST

దున్నపోతు
దున్నపోతు

హైదరాబాద్ ఖైరతాబాద్ కూడలిలో దున్నపోతు హల్​చల్ చేసింది. చింతల్ బస్తీ సదర్ ఉత్సవాలకు ముస్తాబు చేస్తుండగా.. తాడు తెంపుకొని దున్నపోతు పరుగు తీసింది. చింతల్ బస్తీ నుంచి ప్రధాన రోడ్డుపై దున్నపోతు వాహనాలు ధ్వంసం చేయడంతో పాటు పలువురికి గాయాలు చేసింది. వెంబడించిన దున్నపోతు నిర్వాహకులు ఖైరతాబాద్ కూడలి వద్ద అడ్డుకున్నారు. గాయాలైన పలువురిని స్థానిక ఆసుపత్రికి తరలించారు.

ఇదీ చదవండి: VAT On Petrol: రేపు రాష్ట్రవ్యాప్తంగా భాజపా నిరసనలు

ABOUT THE AUTHOR

...view details