ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అప్పుల బాధతో గొంతు కోసుకున్న వ్యక్తి - స్థానికులు

వ్యాపారంలో నష్టం, అప్పుల బాధ...జీవితంపై విరక్తి చెంది సికింద్రాబాద్​ రైల్వే స్టేషన్​ పార్కింగ్ సమీపంలో ఓ వ్యక్తి బ్లేడుతో గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. బాధితుడిని స్థానికులు హుటాహుటిన గాంధీ ఆసుపత్రికి తరలించారు.

అప్పుల బాధతో గొంతు కోసుకుని వ్యక్తి ఆత్మహత్యాయత్నం

By

Published : Jul 26, 2019, 10:12 AM IST

అప్పుల బాధతో ఓ వ్యక్తి బ్లేడ్​తో గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ పార్కింగ్​ సమీపంలో చోటు చేసుకుంది. అనంతరం హాహాకారాలు చేస్తూ రోడ్డు పైకి పరుగులు తీశాడు. స్థానికులు అతన్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.
బాధితుడు నెల్లూరుకు చెందిన ప్రశాంత్​గా పోలీసులు గుర్తించారు. విషయం తెలుసుకున్న బంధువులు గాంధీ ఆసుపత్రికి చేరుకున్నారు. తాను పని చేస్తోన్న సిమెంట్ ఇటుకల వ్యాపారంలో నష్టం రావడం, అప్పుల బాధ, అనారోగ్య సమస్యలతో ఆత్యహత్యాయత్నం చేసినట్లు ప్రశాంత్ వెల్లడించాడు.

అప్పుల బాధతో గొంతు కోసుకుని వ్యక్తి ఆత్మహత్యాయత్నం

ABOUT THE AUTHOR

...view details